Kaif Comments On Surya Kumar Yadav: టీమిండియా టి20 క్రికెట్లో ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ శకం నడుస్తోంది. అతడు జుట్టును నడిపిస్తున్న విధానం.. బ్యాట్ ద్వారా చెబుతున్న సమాధానం టీమిండి అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. ఆసియా కప్ లో సూర్యకుమార్ యాదవ్ తిరుగులేని స్థాయిలో టీమ్ ఇండియా నడిపిస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మేనేజ్మెంట్ సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించింది. ఇతడు ఎలా జట్టును నడిపిస్తాడు.. ఎలా ఇతడికి ఇదంతా సాధ్యమవుతుంది.. అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమయ్యేవి. అయితే వాటన్నింటికీ తన ఆటతోనే సమాధానం చెప్పాడు సూర్య కుమార్ యాదవ్. కొన్ని సందర్భాలలో బ్యాటర్ గా విఫలమైనప్పటికీ ప్లేయింగ్ 11 ద్వారా అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు.
అతడు పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 24 మ్యాచ్లకు సారధ్యం వహించాడు. ఇందులో భారత్ 19 గెలిచింది. సూర్య ఆధ్వర్యంలో టీమిండియా ఇంతవరకు ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. విదేశాలలోనే కాదు స్వదేశంలో కూడా అదే జోరు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సూర్య నాయకత్వంలో అభిషేక్ శర్మ, సంజు, తిలక్ వర్మ, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి వారు భవిష్యత్తు ఆశకిరణాలుగా కనిపిస్తున్నారు. ప్రస్తుత ఆసియా కప్ లో కూడా టీమిండియా దుమ్ము రేపుతుంది. ఓటమి అనేది లేకుండా లీగ్ దశను ముగించింది. సూపర్ 4 పోరుకు రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో తలపడబోతోంది. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందులో సీనియర్ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
” సూర్య కుమార్ యాదవ్ గొప్ప ఆటగాడు. అతడు నోటితో కంటే ఆట ద్వారానే ఎక్కువ సమాధానం చెప్పాడు. బ్యాట్ ద్వారా ప్రత్యర్థులకు గట్టి సమాధానం చెప్పడం అంటే అంత సులువు కాదు. అతని నాయకత్వంలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. జట్టులో ఉన్న అందరి ఆటగాళ్లతో ఎలాంటి ఫలితాన్ని రాబట్టాలో అతడు తెలుసుకున్నాడు. అందువల్లే దానిని తుది కంటా పాటిస్తున్నాడు. ఈ విషయంలో టీమిండియాలో విజయవంతమైన సారధి రోహిత్ శర్మని కూడా మించిపోయాడు. ఇలాంటప్పుడే ఆటగాడిలో ఉన్న అసలు సామర్థ్యాలు బయటపడుతుంటాయి. ఆ సామర్థ్యాలను నూటికి నూరు శాతం బయటపడేలా చేస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. అతని నాయకత్వం ఇలానే సాగిపోతే టీమిండియా పొట్టి ఫార్మాట్లో మరింత బలోపేతం అవుతుందని” కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Looks like Rohit Sharma finally found a partner in crime Surya joins the ‘forgetting names at toss’ club while announcing changes
Surya Kumar Yadav : I Have become like Rohit Sharma (Laughs) pic.twitter.com/o2Y9ANQlh3
— (@TheRealPKFan) September 19, 2025