Mohammad Azharuddin : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంతో నెలకొన్న వివాదం ముగిసింది. ఇక హైదరాబాద్ జట్టు ఆడుతున్న మ్యాచ్లకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న క్రికెట్ అభిమానులకు షాక్ ఇస్తూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది.. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలోని ఓ స్టాండ్ కు మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ పేరును తొలగిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్ మన్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాస్త వివాదంగా మారింది. కోర్టుకు వెళ్తానని అజహరుద్దీన్ హెచ్చరించారు. అంతేకాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్ మన్ నిర్ణయంపై అజహారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన ఘనత..
అజహారుద్దీన్ ఏమన్నారంటే..
” నేను టీమిండియా కు 10 సంవత్సరాలు కెప్టెన్ గా పనిచేశాను. జట్టు విజయాల కోసం విపరీతంగా కృషి చేశాను. నా ఆధ్వర్యంలో జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. అటువంటి నన్ను అవమానాలకు గురి చేస్తున్నారు.. నేను మూర్ఖుడిని కాదు. స్టాండ్ కు పేరు పెట్టే సమయానికి నా పదవీకాలం మొత్తం ముగిసిపోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి కార్యకలాపాలు పెరిగిపోయాయి. కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. దానికి కొంతమంది వ్యక్తులు కూడా తోడు కావడంతో అడ్డగోలుగా దండా కొనసాగుతోంది. అవినీతి కార్యకలాపాలలో తాను పాల్గొనక పోవడం వల్లే లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెడుతున్నారు. ఒక దిగ్గజ ఆటగాడికి విలువ ఇవ్వకుండా ఇలా వేధిస్తున్నారు. స్టాండ్ కు పేరు పెట్టమని నేను అడగలేదు. నేను ఎన్నడు కూడా ఎవరిని అలా ప్రాధేయపడలేదు. కానీ ఇప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు స్టాండ్ కు పేరు తొలగించాల్సిన అవసరం ఏముంది.. దేశంలో వివిధ మైదానాలలో స్టాండ్ లకు ఆటగాళ్ల పేర్లు పెట్టారు. వాళ్ల పేర్లను అర్థంతరంగా తొలగించలేదు కదా. అసలు క్రికెట్తో సంబంధం లేని వ్యక్తుల పేర్లు కూడా మైదానాలకు పెడుతున్నారు. ఆ లెక్కన వాళ్ల పేర్లు కూడా ఇలాగే తొలగిస్తారా.. ఇది ఎక్కడైనా ఉందా? లేక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మాత్రమే జరుగుతోందా” అని అజహారుద్దీన్ ప్రశ్నించారు. ఒకవేళ హైకోర్టుకు అజహరుద్దీన్ వెలితే.. మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచులనం సృష్టించడం ఖాయం. అయితే అజహారుద్దీన్ పేరు ఎందుకు తొలగించారు.. దాని వెనుక ఎవరి ప్రమేయం ఉంది.. ఉన్నట్టుండి అతని పేరు తొలగించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సి ఉంది.
Also Read : ఐపీఎల్ లో కి మరో టీనేజర్.. CSK తరఫున 17 ఏళ్ల ఆటగాడి ఎంట్రీ.. ఎన్ని పరుగులు చేశాడంటే..