Mohammad Amir Retirement: ఇంత ఉపోద్ఘాతం చెప్పామంటే.. అతడు మామూలు బౌలర్ కాదు.. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ స్థాయిలో పేరు తెచ్చుకోవాల్సిన ఈ బౌలర్ అర్ధాంతరంగా తన కెరియర్ ముగించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దిక్కుమాలిన పాకిస్తాన్ దేశంలో పుట్టాడు. బంగారు కత్తిని ఎలా వాడుకోవాలో తెలియని జట్టులో క్రికెటర్ అయ్యాడు. ఆ జట్టులో కోచ్ లకు ఇతడిని ఎలా వాడుకోవాలో తెలియదు. వజ్రం లాంటి అతడి ఆటను జట్టుకు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అందువల్లే అతడు వెలుగులోకి రాకుండానే చీకట్లోకి వెళ్లిపోయాడు. ఒకవేళ ఇలాంటి బౌలర్ గనుక భారత జట్టులో ఉండి ఉంటే.. తక్కువలో తక్కువ 40 ఏళ్ల వరకు తన కెరియర్ కొనసాగించేవాడు. వందల కోట్లకు ఎదిగేవాడు. ఐపీఎల్ లాంటి క్యాష్ రీచ్ లీగ్ లో దుమ్ము లేపేవాడు. చివరికి జాతీయ జట్టులో తన పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. అమీర్ వేసే బంతులు నిప్పుల్లా గా ఉంటాయి. బుల్లెట్ లాగా దూసుకు వస్తాయి. వేగం అనేది అంతకుమించి ఉంటుంది. 2016లో ఆసియా కప్ లో భారత జట్టుతో తలపడిన మ్యాచ్లో అమీర్ వేసిన స్పెల్ న భూతో న భవిష్యత్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లను తన బంతులతో వణికించాడు. అప్పుడప్పుడు తనకు అవకాశాలు లభిస్తే.. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా 270కి పైగా వికెట్లను పడగొట్టాడు. దీనిని బట్టి అతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శిఖరాగ్రన ఉండేవాడు
2010లో అనుకుంటా.. ఆస్ట్రేలియా తోపు ఆటగాడు వాట్సన్ కు చుక్కలు చూపించాడు. అతడు మైదానంలో నిలబడేందుకే భయపడేలాగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ కూడా అదే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రికీ పాంటింగ్, వాట్సన్ ఇతడిని ప్రశంసలతో ముంచేత్తారు. సచిన్ నుంచి మొదలు పెడితే ఇమ్రాన్ ఖాన్ వరకు ఇతడి బౌలింగ్ శైలిని కొనియాడారు. డేవిడ్ వార్నర్ అయితే.. అమీర్ బౌలింగ్ చూస్తే అసూయగా ఉందని వ్యాఖ్యానించాడు. వసీం అక్రమ్ పాక్ బౌలింగ్ దళానికి వజ్రాయుధమని కొనియాడాడు. స్టీవ్ స్మిత్ ప్రశంసలతో ముంచెత్తాడు. అమీర్ తన బౌలింగ్లో కుక్ ను నాలుగు సార్లు అవుట్ చేశాడు. డేవిడ్ వార్నర్ ను ఐదుసార్లు పెవిలియన్ పంపించాడు. రోహిత్ శర్మను మూడుసార్లు దొరకబుచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీని రెండుసార్లు వెనక్కి పంపించాడు. సచిన్ టెండూల్కర్ ను ఒకసారి తన చేతులతో అవుట్ చేశాడు. తనకు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అమీర్ సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేసి.. అదరగొట్టాడు.. వాట్సన్, స్మిత్ లాంటి ఆటగాళ్లను వెనక్కి పంపించాడు. ఎంతో గొప్పగా పేరు తెచ్చుకోవాల్సిన ఇతడు.. క్రికెట్ నుంచి వైదొలిగాడు. పాకిస్తాన్ దేశంలో క్రికెట్ జట్టులో నెలకొన్న రాజకీయాల వల్ల ఆటకు దూరమయ్యాడు. సల్మాన్ బట్ లాంటి సన్నాసుల వల్ల తన కెరీర్నే కోల్పోయాడు. ఒకవేళ ఇతడు గనుక భారత జట్టు క్రికెటర్ అయి ఉంటే.. ప్రపంచ క్రికెట్ ను శాసించేవాడు. శిఖరాగ్రాన నిలిచేవాడు.