Mitchell Marsh : ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా సాధ్యం కాదు రికార్డులను అతడు బద్దలు కొట్టి.. తను ఎంతో ప్రత్యేకమని నిరూపించాడు. ఇక ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో లక్నో జట్టు తరఫున ఆడుతున్న మిచెల్ మార్ష్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ లక్నో బెంగళూరుతో ఆడుతోంది. ఈ మ్యాచ్లో మార్ష్ 67 పరుగులు చేశాడు. 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అతడి దూకుడు వల్ల లక్నో జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ సీజన్లో మార్ష్ 621 పరుగులు చేశాడు. తద్వారా కేఎల్ రాహుల్ 2022 సీజన్లో నెలకొల్పిన 616 పరుగుల రికార్డును బదులు కొట్టాడు. ఇక 2024 లో లక్నో జట్టు తరఫున కేఎల్ రాహుల్ 520 పరుగులు చేశాడు. 2022లో 616 పరుగులు చేశాడు. ఇక ఇదే సీజన్లో నికోలస్ పూరన్ 511 పరుగులు చేశాడు. తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ ద్వారా మార్ష్ అటు కేఎల్ రాహుల్, ఇటు పూరన్ రికార్డులను ఏకకాలంలో బద్దలు కొట్టాడు. ఇక 2022లో క్వింటన్ డికాక్ 508 పరుగులు చేశాడు. లక్నో జట్టు తరఫున ఒక సీజన్లో 50 కంటే ఎక్కువ పరుగులు ఏడుసార్లు చేసిన ఘనతను మార్ష్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత సీజన్లో మార్ష్ ఏడుసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2022లో కేఎల్ రాహుల్ 6 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2025లో మార్క్రమ్ ఐదు సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇక నికోలస్ పూరన్ ఈ సీజన్లో ఐదుసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
Also Read : ఏం క్యాచ్ రా బాబూ.. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో వైరల్.. కుంబ్లే రికార్డ్ బద్దలు కొట్టిన కింగ్
మార్ష్ దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. అతడికి సరైన జోడి లేకపోవడంతో లక్నో జట్టుకు పెద్దగా ఉపయోగ అంటూ లేకుండా పోయింది. ఒకవేళ గనుక అతనికి తగ్గట్టుగా కొంతమంది సపోర్ట్ ఇచ్చి ఉంటే లక్నో జట్టు కచ్చితంగా విజయాలు సాధించేది. ప్లే ఆఫ్ దాకా వెళ్ళేది. కానీ మిగతా ఆటగాళ్లు అంతగా సపోర్ట్ ఇవ్వకపోవడంతో మార్ష్ ఆడిన ఆట వృధా ప్రయత్నం అయిపోయింది. అయినప్పటికీ అతడు జట్టు విషయంలో.. జట్టు ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా భారీగా పరుగులు చేసి లక్నో జట్టు పరువు కాపాడాడు. లక్నో జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్ళలేకపోయినప్పటికీ..మార్ష్ ఆడిన ఇన్నింగ్స్ ఆ జట్టు అభిమానులకు ఎప్పటికీ గుర్తుకే ఉంటుంది. ” అతనికి తగ్గ ఆటగాడు ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కాకపోతే మిగతా ఆటగాళ్లు అంతగా ఆడలేక పోవడంతో మార్ష్ ఆడిన ఆట వృధా ప్రయత్నం అయిపోయింది. అతడు గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజయాలలో తనవంతు పాత్ర పోషించాడు. ఒకవేళ లక్నో జట్టు కనుక మిగతా మ్యాచ్లలో గెలిచి ఉంటే కచ్చితంగా పరిస్థితి మరో విధంగా ఉండేది. ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయేది.. కానీ ఈసారి కూడా దురదృష్టం లక్నో జట్టుతో కలిసి ప్రయాణం చేస్తోందని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.