Jitesh Sharma : లక్నో బృందం తన చివరి లీగ్ మ్యాచ్ మంగళవారం ఆడింది. ఈ మ్యాచ్ గెలిస్తే లక్నోకు ఒనగూరేది ఏమీ లేదు. కాకపోతే విజయంతో లీగ్ ను ముగించిందనే సంతృప్తి తప్ప.. కానీ ఈ మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే మాత్రం టాప్ -2 లోకి వెళ్తుంది. సరిగ్గా దీనినే అంచనా వేశాడు లక్నో సారధి రిషబ్ పంత్. అందువల్లే అతడు సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకొని బెంగళూరుకు ఉపశమనం కలిగించాడు. బెంగళూరు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచినప్పటికీ బెంగళూరు బౌలింగ్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సంజీవ్ గోయంక జట్టు రిషబ్ సెంచరీ ఇన్నింగ్స్ వల్ల 228 రన్స్ టార్గెట్ బెంగళూరు ముందు ఉంచింది. ఈ టార్గెట్ ను మరో 8 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు ఫినిష్ చేసింది. ఇక ఈ విక్టరీ ద్వారా బృందం టాప్ -2 లోకి వెళ్లిపోయింది. గురువారం క్వాలిఫైయర్ -1 లో లీగ్ టాపర్ పంజాబ్ జట్టుతో బెంగళూరు తలపడుతుంది. శుక్రవారం గిల్ సేన ఎలిమినేటర్ విభాగంలో ముంబైతో తలపడుతుంది.
బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో 17 ఓవర్లో దిగ్వేష్ రాతి బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఉన్నటువంటి తన బౌలింగ్ యాక్షన్ ఆపి.. బంతితో బెయిల్స్ పడగొట్టాడు. అప్పటికి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో జితేష్ శర్మ ఉన్నాడు. అప్పటికి అతడు క్రీజ్ దాటాడు. దీంతో దిగ్వేష్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు బదిలీ చేశాడు. కానీ జైంట్ స్క్రీన్ నాట్ అవుట్ అని చూపించండి. ఎందుకంటే లక్నో సారధి పంత్ తన అప్పీల్ ఉపసంహరించుకున్నాడని.. అందువల్లే థర్డ్ అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని కామెంటేటర్లు పేర్కొన్నారు. పంత్ తీసుకున్న ఈ నిర్ణయం బెంగళూరుకు ఉపశమనం కలిగించిందని.. అందువల్లే ఆ జట్టు విజయం సాధించిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.” పంత్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది అంటున్నారు. కాకపోతే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఆటగాడు ఒక అడుగు ముందుకు వేయడం సర్వసాధారణం. ఇక్కడ జితేష్ అలా వ్యవహరించి ఉండకూడదు. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. అది తెలుసు కాబట్టి పంత్ అలా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉంటాడు. మొత్తానికి బెంగళూరు అభిమానుల గుండెల్లో అతడు చిరస్థాయిగా నిలిచిపోయాడు. మైదానంలో చిచ్చరపిడుగు మాత్రమే కాదు.. ఇలాంటి నిర్ణయాలతో అతడు సరికొత్తగా కనిపిస్తున్నాడు. సెంచరీ చేసి తన మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈ నిర్ణయంతో శిఖరాగ్రానికి చేరుకున్నాడని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.