BBL Mitchell Marsh: బిగ్ బాష్ లీగ్ లో సంచలనం నమోదయింది. ఆస్ట్రేలియా టి20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న షాన్ మార్ష్ దుమ్మురేపాడు. ఈ టోర్నీలో హోబర్ట్ హరి కేన్స్ జట్టుకు ఊహించని ఫలితాన్ని అందించాడు. అంతేకాదు, తను ప్రాతినిధ్యం ఇస్తున్న పెర్త్ స్కార్చర్స్ కు అదిరిపోయే కానుక అందించాడు.
టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు మార్ష్. బిబిఎల్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అతడు.. హోబర్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పెర్త్ జట్టు తరఫున ఆడుతున్న అతడు 58 బంతుల్లో 102 పరుగులు చేశాడు. తద్వారా హోబర్ట్ ఘటన 40 పరుగుల తేడాతో పెర్త్ జట్టు ఓడించేలా చేశాడు. ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు మార్ష్ సారధిగా వ్యవహరించబోతున్నాడు. అతడిని సారథిగా ప్రకటించిన కొద్ది గంటలకే మైదానంలో పెను విధ్వంసం సృష్టించాడు. గురువారం రాత్రి హోబర్ట్ హరి కేన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దుమ్మురేపాడు. 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో సంచలనం సృష్టించాడు. ఆరోన్ హార్డీ తో కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని అతడు నిర్మించాడు. బిబిఎల్ చరిత్రలో మూడవ వికెట్ కు ఇది అత్యుత్తమ భాగస్వామ్యం. హార్డీ 43 బంతుల్లో ఐదు సిక్సర్ల సహాయంతో 94 పరుగులు చేశాడు. పెర్త్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేయగా.. హరి కేన్స్ జట్టు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మార్ష్ కెరియర్ లో రెండవ బిబిఎల్ సెంచరీ చేశాడు.
మార్ష్ సూపర్ బ్యాటింగ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఖుషి ఖుషీగా ఉంది. వాస్తవానికి ఈ మ్యాచ్లో మార్ష్ 18 పరుగుల వద్ద అవుట్ అవాల్సి ఉండేది. అప్పుడు ఇచ్చిన క్యాచ్ ను మాథ్యూ వేడ్ అందుకోలేకపోయాడు. 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా రెహాన్ అహ్మద్ బౌలింగ్లో భారీ షాట్ ఆడిన మార్ష్.. వేడ్ క్యాచ్ జార విడవడంతో మరో లైఫ్ అందుకున్నాడు. ఇక ఈ సిరీస్ లో ఆడిన మొదటి నాలుగు మ్యాచ్లలో మార్ష్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అతనికి.. ఈ సెంచరీ ఎంతో ఊరట ఇచ్చింది. ఆస్ట్రేలియా టి20 జట్టులో ఉన్న కూపర్ కన్నోలీ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. చేజింగ్లో హరి కేన్స్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే నిఖిల్ చౌదరి 31, వేడ్ 29 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
View this post on Instagram