Microsoft Outage: మైక్రోసాఫ్ట్ మరోసారి డౌన్ అయింది. దీని కారణంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు తీవ్రసమస్యలను ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏడు నెలల క్రితం గతేడాది జూలైలో మైక్రోసాఫ్ట్ అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈసారి కంపెనీ మైక్రోసాఫ్ట్ ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ 365, ఇతర సర్వీసులలో అంతరాయం సమస్య వేలాది మంది వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసింది.
మైక్రోసాఫ్ట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇమెయిల్ అకౌంట్లలోకి లాగిన్ అవ్వడంలో.. మైక్రోసాఫ్ట్ యాప్‌లను ప్రాసెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 37,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ ను ఉపయోగించలేకపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. అయితే 24,000 మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ 365 సర్వీసును ఉపయోగించలేకపోతున్నామని ఫిర్యాదులు చేశారు. ఇది మాత్రమే కాదు, కొంతమంది మైక్రోసాఫ్ట్ టీమ్స్ ను యాక్సెస్ చేయడంలో కూడా సమస్యలను ఎదుర్కొన్నారు.
ఈ అంతరాయం కారణంగా, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లలో నివసించే వినియోగదారులు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అంతరాయం తర్వాత వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కంపెనీకి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు కంపెనీ స్పందించింది. ఈ అంతరాయం సమస్య త్వరలో పరిష్కరించబడుతుందని వినియోగదారులకు హామీ ఇచ్చింది.
వినియోగదారుల ఫిర్యాదులు పేరుకుపోవడంతో.. ఆ కంపెనీ అంతరాయానికి కారణాన్ని గుర్తించామని పేర్కొంటూ మరొక పోస్ట్ చేసింది. సమస్యకు కారణమైన కోడ్‌ను తీసివేశామని.. తమ టెక్నికల్ టీం ఇప్పుడు రికవరీ ప్రక్రియను పర్యవేక్షిస్తోందని తెలిపింది. చాలా సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని కంపెనీ ధృవీకరించింది.
జూలై 2024లో ఏం జరిగింది?
గతేడాది జూలైలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యవస్థ నిలిచిపోయింది. దీని కారణంగా భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా కంపెనీల సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా వినియోగదారులు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. కంపెనీలు విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇది మాత్రమే కాదు, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్వర్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఐటి రంగం కూడా కుప్పకూలింది.
We’re reviewing available telemetry and customer provided logs to understand the impact. We’ve confirmed this issue is impacting various Microsoft 365 services. Refer to MO1020913 for more detailed information.
— Microsoft 365 Status (@MSFT365Status) March 1, 2025