MI Vs SRH IPL 2025: ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో దుమ్మురేపే ఆట తీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్.. ఆ తర్వాత ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది.. ఏ మాత్రం పోరాటపటిమ చూపించకుండా చేతులెత్తేసింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చేజింగ్ లో విశ్వరూపం చూపించిన హైదరాబాద్.. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో అనామక జట్టు కంటే దారుణంగా ఆడింది. మొత్తంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోకి చేరుకుంది.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో తనకంటే తక్కువ స్థానంలో ఉన్న జట్ల మాదిరిగా కూడా హైదరాబాద్ ఆడటం లేదు. బౌలింగ్ అద్వానంగా ఉంది. బ్యాటింగ్ చండాలంగా ఉంది. ఫీలింగ్ దరిద్రంగా ఉంది. మొత్తంగా హైదరాబాద్ జట్టు ప్రస్థానం అధమ స్థానంలో కొనసాగుతోంది..
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ గుట్టు పట్టేశాయి.. ఆ ప్రణాళికతో ఓడిస్తున్న ప్రత్యర్థి జట్లు
ముంబై పై ఓడిపోయినప్పటికీ..
ముంబై జట్టు చేతిలో ఓడిపోయినప్పటికీ హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు 7 మ్యాచులు మాత్రమే ఆడి.. రెండిట్లో మాత్రమే గెలిచింది. హైదరాబాద్ ఇంకా ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో అన్ని మ్యాచ్లను గెలవాలి. ఒకవేళ ఆరు గెలిస్తే.. అది భారీవ్యత్యాసంతో విజయం సాధించాలి. ఒకవేళ ఐదు మ్యాచ్లో గెలిస్తే నెట్ రన్ రేట్ గొప్పగా ఉండాలి. అయితే ఇప్పుడు హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ -1.217 గా ఉంది. ఇదంతా కూడా పాజిటివ్ లోకి రావాలంటే హైదరాబాద్ జట్టు అద్భుతాలు చేయాలి. పరాయి మైదానాలపై విధ్వంసాలు సృష్టించాలి. బౌలింగ్, బ్యాటింగ్లో సరికొత్త ఆట తీరు చూపించాలి. అప్పుడే హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్తుంది. లేకుంటే గ్రూపు నుంచే ఎగ్జిట్ అవుతుంది. అలా జరగదు అనుకుంటే హైదరాబాద్ జట్టులో సమూల మార్పులు చేపట్టాలి. సరిగ్గా ఆడని ఆటగాళ్లను కచ్చితంగా పక్కన పెట్టాలి. అప్పుడే హైదరాబాద్ జట్టుకు ఊహించిన ఫలితాలు వస్తాయి. బ్యాటింగ్ సరిగ్గా చేయని వారిని పక్కనపెట్టి.. వారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. ఇక బౌలింగ్ లోనూ సమూల మార్పులు చేపట్టాలి. ప్రక్షాళన వేగవంతంగా చేయాలి. బౌలర్లను వైవిధ్యం చూపించేవారికి పెద్దపీట వేయాలి. ఇక ఫీల్డింగ్ లోను హైదరాబాద్ జట్టు మెరుగుపడాలి. ఇవన్నీ జరిగితేనే హైదరాబాద్ జట్టుకు తదుపరి మ్యాచ్లలో సానుకూల ఫలితాలు వస్తాయి. హైదరాబాద్ ఆటతీరు పూర్తిగా మార్చుకోవాలి. ఏ టాకింగ్ ఆటను ఒంట పట్టించుకోవాలి. బౌలింగ్ కూడా అద్భుతంగా చేయాలి. అప్పుడే హైదరాబాద్ జట్టుకు విజయాలు లభిస్తాయి. లేనిపక్షంలో ఇలాంటి ఓటములే ఎదురవుతాయి. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంలో విపరీతమైన కసరత్తు చేయాలి. అవసరమైతే కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను పూర్తిగా పక్కన పెట్టాలి.
Also Read: రోహిత్ శర్మ..ఓవర్ నైట్ కెప్టెన్ కాదు.. దాని వెనుక జీవితానికి మించిన కష్టం.. గూస్ బంప్స్ వీడియో ఇది