MI vs RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున బౌల్ట్ తొలి ఓవర్ వేశాడు. అతడు వేసిన తొలి బంతిని బెంగళూరు జట్టు ఓపెనర్ సాల్ట్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత అద్భుతమైన బంతిని వేయడంతో.. దానిని సాల్ట్ తప్పుగా అంచనా వేశాడు. దీంతో బంతి కాస్త వికెట్లను గిరాటేసింది. ఫలితంగా తొలి ఓవర్ రెండో బంతికే బౌల్ట్ వికెట్ సాధించాడు. తొలి ఓవర్ లోనే ముంబై జట్టుకు గుడ్ న్యూస్ అందించాడు. అయితే ఇదే టెంపో ను బై బౌలర్లు కంటిన్యూ చేయలేకపోయారు. పిచ్ నుంచి అంతంతమాత్రంగా సహకారం ఉండడంతో బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. చివరికి బుమ్రా సైతం వికెట్లు తీయలేకపోయాడు. పిచ్ నుంచి సహకారం లభించుకుంటే ముంబై బౌలర్లు బెంగళూరు జట్టుకు చుక్కలు చూపించేవారు. మరోవైపు పిచ్ ను బట్టి బౌలర్లను మార్చాల్సిన హార్దిక్ పాండ్యా.. మూస ధోరణి ఎంచుకున్నాడు. పదేపదే పేస్ బౌలర్లతో బౌలింగ్ వేయించాడు. దీంతో బెంగళూరు ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(67) విరోచితంగా బ్యాటింగ్ చేశాడు. దేవదత్ పడిక్కల్(37) కూడా తనదైన పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ, పడిక్కల్ రెండవ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత.. క్రీజ్ లోకి కెప్టెన్ రజత్ పాటిదార్(32*) వచ్చాడు. విరాట్ కోహ్లీ, పాటిదార్ మూడో వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ అయిన తర్వాత లివింగ్ స్టోన్ క్రీజ్ లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. హార్దిక్ బౌలింగ్లో భారీ షాట్ ఆడిన విరాట్.. బుమ్రా కు దొరికిపోయాడు. ఇక లివింగ్ స్టోన్ కూడా హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాటిదర్, జితేష్ శర్మ ఆడుతున్నారు. ఈ కథనం రాసే సమయం వరకు బెంగళూరు జట్టు 15.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
అద్భుతం చేసిన బౌల్ట్
తొలి ఓవర్ లోనే వికెట్ సాధించిన ముంబై బౌలర్ బౌల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2020 ఐపీఎల్ నుంచి లెక్కిస్తే ఫస్ట్ ఓవర్ లో 31 సార్లు వికెట్లు సాధించిన బౌలర్ గా అతడు రికార్డు సృష్టించాడు. చేస్తాను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడినప్పుడు 19సార్లు.. ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడినప్పుడు 12సార్లు అతడు ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్ లోనే వికెట్ సాధించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కు ప్రాతినిధ్యం వహించినప్పుడు 19సార్లు బౌల్ట్ తొలి ఓవర్లో క్రికెట్ సాధించాడు. ముంబై ఇండియన్స్ జట్టు 23 సార్లు తొలి ఓవర్ లో వికెట్ సాధించింది. ఇందులో బౌల్ట్ 12సార్లు తొలి ఓవర్ లో వికెట్ సాధించాడు. చెన్నై జట్టు 19సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ 14 సార్లు, కోల్ కతా నైట్ రైడర్స్ 13 సార్లు, లక్నో సూపర్ జెయింట్స్ 12సార్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 11 సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 సార్లు, గుజరాత్ టైటాన్స్ 11 సార్లు తొలి ఓవర్లో వికెట్ సాధించాయి.