MI Vs RCB IPL 2025: ఈ డైలాగు నిన్న రాత్రి ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటిదర్ సారధ్యం వహించాడు. ఈ ప్రకారం చూసుకున్నా పాటిదర్, హార్దిక్ పాండ్యాకు బంధుత్వం లేదు. బీరకాయ చుట్టరికం కూడా లేదు. మరి ఎందుకు కేజీఎఫ్ సినిమా రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చామంటే.. ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నది నిజమే.. కానీ బెంగుళూరు జట్టులో అతడి సోదరుడు కృణాల్ పాండ్యా ఉన్నాడు. గత సీజన్లో కృణాల్ పాండ్యాను బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. స్పిన్ బౌలింగ్ లో కృణాల్ పాండ్యాకు తిరుగులేదు. పైగా చివరి ఓవర్లను అతడు అద్భుతంగా వేస్తాడు. అది మరోసారి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా నిరూపితమైంది. అయితే ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్లో అదరగొట్టినప్పటికీ.. చివర్లో పరుగులు అవసరమైనచోట.. గెలుపుకు దగ్గరైన చోట కృణాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును దెబ్బ కొట్టాడు. చివరి ఓవర్ ను అద్భుతంగా వేసి ముంబై ఇండియన్స్ జట్టుకు కోలుకోలేని స్ట్రోక్ ఇచ్చాడు. దీంతో హార్దిక్ పాండ్యాపై కృణాల్ పాండ్యా పై చేయి సాధించాడు. ఇద్దరు సోదరులే అయినప్పటికీ.. మ్యాచ్ విషయంలో పక్కా ప్రొఫెషనలిజం చూపించారు. సూపర్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. గెలుపు, ఓటమి అనే వాటిని పక్కన పెడితే.. క్రికెట్లో సరికొత్త ఆరోగ్యకరమైన పోటీకి అటు హార్దిక్, ఇటు కృణాల్ తెర లేపారు. చూసేవాళ్లకు కూడా వారిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా అనిపించింది.
Also Read: హిట్ మ్యాన్ నే చెడుగుడు ఆడేశావు.. నువ్వు తోపు సామీ
విజయం అంచుల వరకు..
బెంగళూరు విధించిన 223 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై జట్టు 12 ఓవర్లకు 99 పరుగులు చేసింది. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది.. అదిగో అప్పుడు వచ్చాడు హార్థిక్ పాండ్యా క్రీజ్ లోకి..ఓ ఎండ్ లో తిలక్ వర్మ దూకుడుగా ఆడుతుంటే.. మరోవైపు హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీపక్ చాహర్ బౌలింగ్లో అయితే సిక్సర్ల వర్షం కురిపించాడు. పరుగుల అంతరాన్ని అత్యంత వేగంగా తగ్గించాడు. దీంతో ముంబై జట్టు గెలుస్తుందని.. బెంగళూరు జట్టుకు పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. ఈ దశలో తిలక్ వర్మ(56) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడగా.. దానిని సాల్ట్ అందుకున్నాడు. ఇక అప్పుడు జట్టు భారం మొత్తం హార్దిక్ పాండ్యా పై పడింది.. అతడు కూడా ఒంటరి పోరాటం చేశాడు. 15 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 42 పరుగులు చేశాడు. అయితే హేజిల్ వుడ్ బౌలింగ్లో అతడు అవుట్ కావడంతో.. ఒకసారి గా ముంబై జట్టు ఆశలు మొత్తం నీరు కారిపోయాయి. చివరి ఓవర్లో మొదటి రెండు బంతుల్లో శాంట్నర్, దీపక్ చాహర్ వికెట్లను పడగొట్టిన కృణాల్ పాండ్యా.. ఐదో బంద్ కి నమన్ ధీర్ వికెట్ కూడా సొంతం చేసుకున్నాడు. మొత్తంగా చివరి ఓవర్ లో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసి.. ముంబై జట్టుకు సొంతమైదానంలో కోలుకోలేని షాక్ ఇచ్చిన కృణాల్.. బెంగళూరు జట్టుకు ఉత్కంఠ భరితమైన విజయాన్ని అందించాడు. మొత్తంగా తమ్ముడితో సాగిన హోరాహోరి పోరులో అన్న విజయం సాధించాడు.
Also Read: వన్ డౌన్ లో వచ్చి.. సెంచరీలు కొట్టిన తిలక్ ను 4వ స్థానంలోనా?
View this post on Instagram