https://oktelugu.com/

MI vs PBKS : అవి బంతులా.. బుల్లెట్ల.. రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు విరగొట్టిన అర్షదీప్.. ఎంపైర్ల గగ్గోలు

MI vs PBKS : అవి బంతులా? బుల్లెట్లా? ఏం వేశావు రా బాబూ.. ఇరగదీశావ్ అంతే.. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ కు ముంబై బ్యాట్స్ మెన్ చిత్తయ్యారు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 16 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో ఉన్న ముంబైని అర్షదీప్ ఒంటిచేత్తో ఓడించాడు. బుల్లెట్ లాంటి యార్కర్ బంతులు వేసి రెండు వికెట్లను విరగొట్టాడంటే ఎంత కసిగా వేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆ బంతులకు రెండు సార్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2023 / 11:41 PM IST
    Follow us on

    MI vs PBKS : అవి బంతులా? బుల్లెట్లా? ఏం వేశావు రా బాబూ.. ఇరగదీశావ్ అంతే.. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ కు ముంబై బ్యాట్స్ మెన్ చిత్తయ్యారు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 16 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో ఉన్న ముంబైని అర్షదీప్ ఒంటిచేత్తో ఓడించాడు. బుల్లెట్ లాంటి యార్కర్ బంతులు వేసి రెండు వికెట్లను విరగొట్టాడంటే ఎంత కసిగా వేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆ బంతులకు రెండు సార్లు ఎంపైర్లు విరిగిన వికెట్ ను పారవేసి కొత్తవి తీసుకొచ్చిపెట్టారు. మరో వికెట్ విరిగితే అసలు లేనట్టుగా తలపట్టుకున్నారు. ఇలాంటి అరుదైన దృశ్యం ఐపీఎల్ లోనే కాదు ఎక్కడా చోటు చేసుకోలేదంటే అతిశయోక్తి కాదు.

    ముంబైతో పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్.. యమ రంజుగా మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 214-8 భారీ స్కోరు చేసింది. కెప్టెన్ సామ్ కరణ్ 55 పరుగులతో దంచికొట్టడంతో ఈ భారీ స్కోరుకు బాటలు వేశాడు.

    అయితే ముంబై కూడా ఛేదనలో ధాటిగానే ప్రారంభించింది. రోహిత్ 44, గ్రీన్ 67, సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యానికి చేరువైంది. చివరి 6 బంతుల్లో 16 పరుగులు చేస్తే గెలిచేదే. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది.

    కెమెరాతో ఉండే మిడిల్ స్టంప్ ను తన రెండు సార్లు టార్గెట్ చేసి వేశాడు అర్షదీప్. 19.3 వ బంతిని ముంబై బ్యాట్స్ మెన్ తిలక్ వర్మకు వేయగా ఏకంగా మిడిల్ స్టంప్ విరిగి రెండు ముక్కలు అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నేహాల్ వదేరా వికెట్ ను కూడా అచ్చం ఇలాగే విసిరాడు. ఈ వికెట్ కూడా మధ్యలోకి విరిగి ముక్కలైంది.

    ఒక వికెట్ విరిగడంతో మొదట ఎంపైర్లు బయట నుంచి తీసుకొచ్చి మళ్లీ పెట్టిపోయారు. మరో వికెట్ ను అర్షదీప్ అలాగే విరగగొట్టడంతో ఎంపైర్లు తలపట్టుకున్నారు. మరోసారి మరో వికెట్ ను తీసుకొచ్చి మరీ పెట్టారు. ఇలా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లను విరగొట్టిన ఘనత అర్షదీప్ సొంతమైంది.

    ఆ స్పీడు, వేగం చూసి నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ అవి బంతులా? బుల్లెట్లా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అర్షదీప్ బౌలింగ్ ను కొనియాడుతున్నారు.

    https://twitter.com/CricCrazyJohns/status/1649837545927360512?s=20