Badminton Finals: ఇండియా కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్స్ లో అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. చివరి వరకూ పోరాడి ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఫైనల్స్ వరకూ వచ్చి ఈ స్థాయి ప్రదర్శన కనబరిచాడంటే అతడి ప్రతిభ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ భారత షెట్లర్ గా అభివర్ణించవచ్చు. ఫైనల్ లో డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఎక్సల్‌సన్ చేతితో 21-10, 21-15 తేడాతో లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. సుమారు 22 నిమిషాల పాటు కొనసాగిన ఫస్ట్ గేమ్ లో లక్ష్య సేన్ చివరి వరకూ తన పోరాటాన్ని కొనసాగించాడు.
తిరిగి పుంజుకునేందుకు ట్రై చేశాడు. గేమ్ మధ్యలో ఒకానొక టైంలో ఇద్దరి మధ్య పోటీ సమానంగా కనిపించింది. కానీ చివరకు లక్ష్య సేన్ పోరాడి ఓడాడు. 31 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ లో 21-15 తేడాతో విక్టర్ విజయం సాధించాడు. ఇక ప్రస్తుతం బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్‌లో విక్టర్ వరల్డ్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
Also Read: ముంబై డీలా.. వీక్ అయిన రోహిత్ సేన… వారి స్థానాల్లో వచ్చేది ఎవరు?
ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ గెలుచుకున్న ఇండియన్స్ లో ప్రకాష్ పదుకోన్, గోపీచంద్ మాత్రమే ఉన్నారు. 1980లో పదుకోన్, 2001లో గోపీచంద్ ఈ టైటిల్ ను సంపాదించుకున్నారు. ఈ టోర్నీలో 1947లో ప్రకాష్‌నాథ్ ఈ టోర్నీ ఫైనల్ వరకు చేరకుని ఓటమి పాలయ్యాడు. 2015లో మహిళల కేటగిరీలో సైనా నెహ్వాల్ సైతం ఫైనల్ వరకు చేరుకుని ఓటమిపాలైంది.
2018లో యూత్ ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్న భారత షట్లర్ లక్ష్య సేన్ గత ఆరు నెలలుగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో లక్ష్య సేన్ 11వ స్థానంలో ఉన్నాడు. లీ జీ జియో మాత్రం 7వ స్థానంలో ఉన్నారు. 2001 ఆగస్టు 16న ఉత్తరాఖండ్ లోని అల్మేడాలో జన్మించిన లక్ష్య సేన్.. బ్యాడ్మింటన్ ప్రముఖ కోచ్‌లు విమల్ కుమార్.. పుల్లెల గోపీచంద్.. యాంగ్ సూయూ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ప్రకాష్ పదుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీలోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు. లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ సైతం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడం విశేషం. ఆయన కూడా లక్ష్ సేన్ కు కోచింగ్ ఇచ్చేవారు.
Also Read: దొడ్డుకర్రలు పట్టుకుని వెంటపడతాం.. కేసీఆర్ మీద రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు..!
Recommended Video: