Viral Kohli: వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో ఇండియా తన మొదటి మ్యాచ్ ని ఆడింది ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించి వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్క టీం కి కూడా ఇండియాని ఓడించడం అంటే అంత ఈజీ కాదు అని అనుకునేలా మరొకసారి మన బ్యాటింగ్ స్టాండర్డ్ ఏంటో ప్రపంచ దేశాలకు సైతం చూపించింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు అలౌట్ అయింది.
ఇక 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మొదట్లోనే ముగ్గురు స్టార్ ప్లేయర్లు డకౌట్ అవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చాలా దారుణమైన స్థితిలో ఇండియన్ టీం కనిపించడంతో ఈ మ్యాచ్ చూసే ప్రతి అభిమాని కూడా ఇండియా దారుణంగా ఓడిపోబోతుంది అనే ఒక ఆలోచనలో అయితే పడ్డారు. మొత్తానికైతే విరాట్ కోహ్లీ ఒక యోధుడిలా నిలబడి గ్రౌండ్ పరిస్థితులు బట్టి మ్యాచ్ ఎలా ఆడితే బాగుంటుంది అనే ఒక స్ట్రాటజీతో నాన్ స్ట్రైక్ లో ఉన్న కే ఎల్ రాహుల్ కి కూడా సలహాలు ఇస్తూ ఆడటం స్టార్ట్ చేశారు.అయితే మ్యాచ్ తర్వాత కే ఎల్ రాహుల్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనకు చెప్పిన విషయం ఏంటో చెప్పాడు అదేంటంటే పిచ్ మనకు అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం మనం చేజ్ చేయాల్సిన స్కోర్ కూడా పెద్దగా లేదు కాబట్టి కొద్దిసేపు మనం టెస్ట్ మ్యాచ్ ఆడదాం అని రాహుల్ కి కూడా చెప్పి ఇద్దరు అదే పనిచేసి చాలా సేపటి వరకు వికెట్ పడకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు మ్యాచ్ పొజిషన్ ని బట్టి, వేసే బౌలింగ్ ను బట్టి ఆస్ట్రేలియన్ బౌలర్లు ఏ స్ట్రాటజీతో అయితే ఉన్నారో దాన్ని గమనించి వాళ్ల ట్రాప్ లో పడకుండా మనవాళ్లు పరుగులు చేయడం మొదలు పెట్టారు.
ఫలితంగా ఇద్దరు కలిసి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఐదో వికెట్ కి ఇద్దరు 165 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఇండియన్ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.85 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అవ్వగా 97 పరుగులతో రాహుల్ మ్యాచ్ ని దగ్గరుండి గెలిపించాడు… దీంతో ఇండియా మొదటి మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా మన టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా మరొకసారి ప్రూవ్ చేసింది. మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత అసలు ఈ మాత్రం టెన్షన్ పడకుండా చాలా సింపుల్ గా ఆ స్కోర్ ని చేజ్ చేసిన విధానం చూసి ప్రపంచ దేశాల క్రికెట్ టీమ్ లకి సైతం వెన్నులో వణుకు పుదుతుంది..