Virat Kohli: 2024లో జరిగే టి20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం ఇప్పటికి నుంచే చాలా రకాల కసరత్తులు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన ఇండియన్ టీమ్ టీ 20 వరల్డ్ కప్ లో ఎలాగైనా గెలవాలని ఆశ పడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ తను ఇక మీదట టి20 మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక టి 20 కి దూరం గా ఉంటేనే తను వన్డేలు, టెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక టి20 మ్యాచ్ లు ఆడటం వల్ల టెస్ట్ వన్డే మ్యాచ్ ల మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాడు. అందువల్లే తను వన్డే, టెస్ట్ మ్యాచ్ లు మత్రమే ఆడాలనుకుంటున్నాడు…
ఇక అందులో భాగం గానే 2025 లో జరిగే టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కోసం తను ఇప్పటినుంచి చాలా కసరత్తులు చేస్తున్నాడు. అందుకే ఎలాగైనా తెస్తులు ఆడి అందులో రాణించాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ కి తను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ శర్మ,కోచ్ రాహుల్ ద్రావిడ్, అలాగే ఇండియన్ టీమ్ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కార్ లు కలిసి ఒక మీటింగ్ కూడా ఆరెంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇందులో ముఖ్యం గా టి20 వరల్డ్ కప్ కోసం ఎవరెవరిని టీమ్ లోకి తీసుకుంటే బాగుంటుంది అనే దానిమీద పలు రకాలు చర్చలు అయితే జరిగాయి. ఇక అందులో భాగంగానే కోహ్లీ మీద వేటు పడే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇక రోహిత్ తో పాటు బుమ్ర కూడా తనదైన రీతిలో టి 20 వరల్డ్ కప్ కోసం ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక విరాట్ కోహ్లీకి అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మూడో స్థానంలో విరాట్ ప్లేస్ ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరు అనే ప్రశ్న తలేత్తగా విరాట్ కోహ్లీ కి రీప్లేస్ మెంట్ గా ఇషాన్ కిషన్ తీసుకోవాలని చూస్తున్నారు.
అయితే మూడో ప్లేస్ లో వచ్చి మ్యాచ్ పొజిషన్ ని చూస్తూ కోహ్లీ లాగా బాగా ఆడతాడనే విషయం మీదనే సెలెక్టర్లు ఇషాన్ కిషన్ ని తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా కూడా చాలా బాగా నైపుణ్యాన్ని చూపించే ప్లేయర్ కావడంతో అందుకే తనను కోహ్లీకి రిప్లేస్ గా వాడాలని చూస్తున్నారు…