IND vs AUS – KL Rahul : 39 పరుగులకు కీలకమైన నాలుగు వికెట్లు నేలకూలాయి. పైగా ఆడుతోంది సొంత దేశంలో.. ఓ వైపు మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగేలా బంతులు వేస్తున్నాడు. అప్పటికే మూడు వికెట్లు తీశాడు. స్టోయినీస్ కూడా తగ్గేదేలే అన్నట్టు అతడు కూడా ఒక వికెట్ తీశాడు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చాడు కేఎల్ రాహుల్. ఆఫ్ కోర్స్ అతడి మీద కూడా జట్టుకు ఏ మాత్రం అంచనాలు లేవు. మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్యా ఉండటంతో జట్టు కిందా మీదా పడి గెలుస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ దశలో కేఎల్ రాహుల్ తనదైన ఆటను ఆడాడు. అంతే కాదు హార్దిక్ కూడా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు.
వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. వీరిద్దరినీ విడదీసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. స్టార్క్, స్టోయినీస్, జంపా, మ్యాక్స్ వెల్ ఇలా ఎంతమంద బౌలింగ్ వేసినా ఈ జోడిని విడదీయలేకపోయారు. ముఖ్యంగా రాహుల్ చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గతకొంత కాలం ఫామ్ లేమితో ఇబ్బందిడపతున్న అతడు ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. షార్ట్ పిచ్ బంతులను డిఫెన్స్ ఆడిన అతడు, చెత్త బంతులను నిర్దాక్షిణ్యంగా బౌండరీ వైపు తరలించాడు. ఈ దశలోనే అతడు తన హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీలో అతడు ఏకంగా ఐదు ఫోర్లు బాదాడు.
చాలాకాలం తర్వాత, అందునా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెటిజన్లు అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులకు నచ్చితే భుజానా మోస్తారు. లేకుంటే కింద పడేస్తారు. శుక్రవారం కూడా ఇదే చేశారు. కొంత కాలంగా సరైన ఇన్నింగ్స్ ఆడని రాహుల్, ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో నెటిజన్లు అతడిని మెచ్చుకుంటున్నారు. ‘రాహుల్ భయ్యా తుస్సీ గ్రేట్ హో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ ట్విట్టర్ ట్రెండింగ్ గా మారాడు.
https://twitter.com/BoiesX45/status/1636740195184967681?s=20