https://oktelugu.com/

KL Rahul : కేఎల్ రాహుల్ కు షాక్ ఇచ్చిన లక్నో జట్టు యాజమాన్యం.. కొత్త కెప్టెన్ గా అతడి నియామకం..

ఇటీవల ఐపీఎల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అయితే ఇందులో లక్నో జట్టు యజమాని వ్యవహరించిన తీరు వార్తల్లో నిలిచింది. ఇదే సమయంలో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పై సానుభూతి వ్యక్తం అయింది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభం కాకముందే మరో సంచలనానికి ఐపీఎల్ యాజమాన్యం శ్రీకారం చుట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 27, 2024 / 10:04 PM IST

    kl rahul

    Follow us on

    KL Rahul: ఇటీవల ఐపీఎల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అయితే ఇందులో లక్నో జట్టు యజమాని వ్యవహరించిన తీరు వార్తల్లో నిలిచింది. ఇదే సమయంలో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పై సానుభూతి వ్యక్తం అయింది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభం కాకముందే మరో సంచలనానికి ఐపీఎల్ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇటీవలి ఐపీఎల్ లో లక్నో జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరు చర్చకు దారి తీసింది. ఓ మ్యాచ్ లో లక్నో జట్టు ఓడిపోవడంతో.. ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్ ను మందలించాడు. సంజీవ్ అదేపనిగా విమర్శిస్తుంటే రాహుల్ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాడు. అతడు అన్నేసి మాటలు అంటుంటే తల ఊపుతూ కనిపించాడు. అది అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన తర్వాత రాహుల్ లక్నో జట్టు నుంచి నిష్క్రమిస్తాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఒక మ్యాచ్ కు అతడు దూరంగా ఉన్నాడు దీంతో లక్నో జట్టు నుంచి రాహుల్ వెళ్ళిపోవడం ఖాయమని అందరూ ఒక అంచనాకు వచ్చారు. వాటిని బలపరిచే విధంగా వచ్చే సీజన్లో లక్నో జట్టుకు నికోలస్ పూరన్ నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతోంది.. పూరన్ తో పాటు కృనాల్ పాండ్యా పేరు కూడా వినిపిస్తోంది.. వచ్చే సీజన్లో కేఎల్ రాహుల్ ను రిటైన్ చేసుకోవాలని లక్నో జట్టు భావిస్తోంది. అయితే అతడిని కెప్టెన్ గా కాకుండా, జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    వాస్తవానికి ఇటీవల సీజన్ లక్నో జట్టు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అంతకుముందు సీజన్లో మాత్రం ప్లే ఆఫ్ దశ దాకా వచ్చింది..మెంటార్ గా గౌతమ్ గంభీర్ ఉండడంతో ఆ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ప్రదర్శన చూపించింది. కేఎల్ రాహుల్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో జట్టు టైటిల్ ఫేవరెట్ గా నిలిచింది.. అయితే కీలకమైన మ్యాచ్ లలో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ దశలోనే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. లక్నో జట్టును సంజీవ్ గోయెంకా ఏడు వేలకు పైగా కోట్లతో కొనుగోలు చేశాడు. 2022లో ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన జట్ల జాబితాలో లక్నో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల సీజన్ లో ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది. కానీ 2023 సీజన్లో మాత్రం ప్లే ఆఫ్ దాకా వచ్చింది..రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే అది ఆ జట్టు విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కేఎల్ రాహుల్ ఉంటే జట్టును ఒకే తాటిపై నడిపిస్తాడని.. వేరే వ్యక్తి వస్తే లక్నో జట్టు సమిష్టి ప్రదర్శన చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.