KL Rahul: వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియా మీద ఇండియా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో వరల్డ్ కప్ ఆరంభంలోనే ఒక మంచి విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఇండియా టీం ఒక సూపర్ విక్టరీని క్రియేట్ చేసింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా మొదట్లో ఇండియా ఓడిపోతుంది అని అనుకున్నారు.కానీ విరాట్ కోహ్లీ,కే ఎల్ రాహుల్ ఇద్దరు కూడా అద్భుతమైన షాట్స్ ఆడుతూ మ్యాచ్ ని చివరి వరకు తీసుకెళ్ళారు. ఇక ఇలాంటి టైం లో కోహ్లీ ఔట్ అవ్వగా, రాహుల్ మాత్రం చివరి వరకు ఉండి చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ గ్రౌండ్ లో ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు.జస్ట్ మోకాళ్ళ పైన కూర్చొని కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యాడు.
దానికి కారణం ఏంటి అంటే 2008వ సంవత్సరంలో ధోని సిబి సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలిచినప్పుడు తను కూడా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా నార్మల్ గా ఒక చిరునవ్వు నవ్వి గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ధోని చివర్లో ఇంకో నాలుగు రన్స్ కొట్టాల్సి ఉండగా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండే అందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ ని ఫార్వర్డ్ చేశాడు అది ఏంటి అంటే మ్యాచ్ గెలిచిన తర్వాత అక్కడ ఎవరు సెలబ్రేట్ చేసుకోకండి చిన్న షేక్ హ్యాండ్స్ మాత్రమే ఇచ్చుకొని వదిలేయండి అని చెప్పాడు. అయితే ధోని అలా ఎందుకు చెప్పాడు అంటే 2008 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా టీమ్ అత్యంత గొప్ప టీమ్ గా కొనసాగుతుంది.అప్పటికి ఆ టీమ్ నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతుంది.అలాంటి సమయంలో ధోని వాళ్ళతో ఒక మైండ్ గేమ్ ఆడాడు.
ఎలా అంటే మనం ఒక గొప్ప టీమ్ ని ఓడించినప్పుడు మాత్రమే ఎక్కువ సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాం.అదే ఒక చిన్ని టీమ్ ని ఓడించినప్పుడు సెలబ్రేషన్స్ అనేవి నార్మల్ గా చేసుకుంటాం… అయితే అప్పుడు ఆస్ట్రేలియా అనేది మన దృష్టిలో గొప్ప టీం కాదు నార్మల్ టీమ్ అని వాళ్లు అనుకునే విధంగా వాళ్ల మీద ప్రెజర్ పడే విధంగా అలా ఆలోచించి ఎవర్ని కూడా సెలబ్రేషన్ చేసుకోవద్దు అని ధోని చెప్పాడు. ఈ మ్యాటర్ అంత ద ధోని టచ్ అనే బుక్ లో ధోనీ రాయడం జరగింది.అయితే అప్పుడు జరిగిన ఆ సిచువేషన్ ఇప్పుడు ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ కి సరిగ్గా సరిపోతుంది.రాహుల్ మ్యాచ్ గెలిపించిన తర్వాత ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి కరెక్ట్ గా సరిపోతుంది అంటూ సోషల్ మీడియా లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత రాహుల్ మాట్లాడిన మాటలను చూస్తే మ్యాచ్ గెలిచాక ఆయన ఎందుకు అలా సాడ్ గా ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది.
ఈ మ్యాచ్ విజయం సాధించడానికి ఇంకొక అయిదు పరుగులు అవసరం ఉన్నప్పుడు ఆయన స్కోర్ 91 గా ఉంది. ఇక ఇలాంటి సమయంలో తను సెంచరీ చేయడానికి మార్గం ఏంటి అంటే ముందు గా ఒక ఫోర్ కొడితే ఆయన స్కోర్ 95 పరుగులు అవుతుంది అలాగే టీం స్కోర్ 199 పరుగులు అవుతుంది అంటే మ్యాచ్ టై అయిపోతుంది.గెలవడానికి ఇంకొక పరుగు అవసరం ఉన్న టైం లో సిక్స్ కొడితే ఆయన సెంచరీ పూర్తి అవుతుంది.అక్కడ మ్యాచ్ కూడా విన్ అయిపోతుంది అని అనుకున్నాడు కానీ ఆయన కవర్స్ మీద నుంచి ఆడిన లాస్ట్ షాట్ ఫోర్ వెళ్తుంది అని అనుకుంటే అది అనుకోకుండా సిక్స్ పోయింది దాంతో మ్యాచ్ విన్ అయింది. ఇక ఆయన స్కోర్ 97 పరుగుల వద్ద నాటౌట్ గా ఉన్నాడు అందుకే చాలా బాధతో రాహుల్ ఉన్నట్టు గా మ్యాచ్ ముగిశాక ఆయన చెప్పడం జరిగింది…