https://oktelugu.com/

KKR vs SRH: మీ ఆటల మన్నువడ.. ఇదేం బ్యాటింగ్ రా నాయనా?

లీగ్, ప్లే ఆఫ్ దశలో కోల్ కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. అలాంటి జట్టు ఫైనల్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్ బ్యాటింగ్ సాగింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 26, 2024 / 10:55 PM IST
    Follow us on

    KKR vs SRH: 8 సంవత్సరాలు ఎదురు చూస్తే ఫైనల్ వెళ్ళింది. లీగ్ దశలో బలమైన ముంబై పై 277 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత బెంగళూరు పై 287 పరుగులు కొట్టి తన రికార్డు తన బద్దలు కొట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో ఏకంగా 125 రన్స్ చేసింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అలాంటి జట్టు ఫైనల్ లో ఏ స్థాయిలో ఆడాలి? ఎంతలా పరుగులు కొట్టాలి? కానీ జరిగిందేమిటి.. హోరాహోరీగా జరగాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్ తో కోల్ కతా ముందు మరోసారి తలవంచింది. భౌమ్యకాశాలు బద్ధలైతే తప్ప హైదరాబాద్ గెలవడం సాధ్యమవుతుంది.

    లీగ్, ప్లే ఆఫ్ దశలో కోల్ కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. అలాంటి జట్టు ఫైనల్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్ బ్యాటింగ్ సాగింది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం చాలా తప్పని కోల్ కతా బౌలర్లు తొలి ఓవర్ నుంచే నిరూపించారు. మార్క్రం 20, కమిన్స్ చేసిన 24 పరుగులే టాప్ స్కోర్ అంటే.. హైదరాబాద్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రి రసెల్ మూడు, స్టార్క్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఫలితంగా 18.3 ఓవర్లలో 113 పరుగులకే హైదరాబాద్ జట్టు ఆల్ అవుట్ అయింది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా.. హైదరాబాద్ చెత్త రికార్డు నమోదు చేసింది.

    టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. వాస్తవానికి ఈ మైదానం చాలా మందకొడిగా ఉంది. మైదానం పరిస్థితి తెలిసి కూడా కమిన్స్ ఆ నిర్ణయం తీసుకోవడం హైదరాబాద్ అభిమానులకు జీర్ణం కావడం లేదు. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కు మొదట్లోనే గట్టి దెబ్బ తగిలింది. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టార్క్ వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయడంలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా వేసిన మరుసటి ఓవర్ లో.. ప్రమాదకరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా కీపర్ కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి వంటి వారు కూడా వెంట వెంటనే అవుట్ కావడంతో.. హైదరాబాద్ ఏ దశలోనూ భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయింది. మరోవైపు కోల్ కతా బౌలర్లలో రాణా, రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి, మార్క్రం, క్లాసెన్ వంటి వారిని అవుట్ చేసి.. హైదరాబాద్ జట్టును ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కనీసం వంద పరుగులైనా చేయగలుగుతుందా అనే దశలో.. కెప్టెన్ కమిన్స్ ఎదురు దాడి దిగడంతో.. ఆ 113 పరుగులైనా చేయగలిగింది. లేకుంటే హైదరాబాద్ ఇన్నింగ్స్ 90 పరుగులకే ముగిసేది.. జయదేవ్, కమిన్స్ 23 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ ఆకాశ స్కోరైనా చేయగలిగింది.. చివరికి రస్సెల్ బౌలింగ్లో కమిన్స్ క్యాచ్ అవుట్ కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 113 పరుగుల వద్ద ముగిసింది. హైదరాబాద్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్నారు.