KKR Vs RCB: గత ఏడాది కూడా బెంగళూరు జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. వరుస ఓటముల తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా దూసుకువచ్చింది. ఏకంగా సెమీస్ దాకా వచ్చింది. కానీ దురదృష్టం వల్ల ఓడిపోయింది. అయితే గత ఏడాది జరిగిన మెగా వేలంలో బెంగళూరు యాజమాన్యం మేలిమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. వారికి భారీగా ముట్ట చెప్పింది. గత సీజన్లో కెప్టెన్ గా ఉన్న డూప్లెసిస్ ను పక్కన పెట్టింది. అతడి స్థానంలో రజత్ పాటిదర్ కు అవకాశం ఇచ్చింది. విరాట్ కోహ్లీ సలహాలు సూచనలు తీసుకుంటూనే.. జట్టులో యువ రక్తం ఎక్కించింది. మెగా వేలంలో కృనాల్ పాండ్యాను తీసుకోవడం ఎంత సరైన నిర్ణయమో.. బెంగళూరు జట్టు యాజమాన్యానికి తొలి మ్యాచ్ ద్వారా తెలిసి వచ్చింది. కృణాల్ పాండ్యా తొలి మ్యాచ్లో మూడు వికెట్లు సాధించడం విశేషం.. మిగతా బౌలర్లు కూడా అతని స్థాయిలో రాణించడంతో తొలి మ్యాచ్లో కోల్ కతా 174 పరుగుల వద్ద ఆగిపోయింది.. అయితే ఈ టార్గెట్ ను 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి బెంగళూరు చేదించడం విశేషం. ఫలితంగా బెంగళూరు తొలి మ్యాచ్ లోనే భారీ విజయాన్ని దక్కించుకొని.. పాయింట్లు పట్టికలో తొలి స్థానంలో నిలిచింది.
Also Read: షారుక్ వ్యాఖ్యానం.. శ్రేయ గాత్రం.. దిశా నాట్యం.. అదిరిపోయిన ఆరంభ వేడుకలు..
ప్రతీకారం తీర్చుకుంది
గత సీజన్లో కోల్ కతా జట్టుతో బెంగుళూరు ( KKR vs RCB) తల పడింది. రెండు మ్యాచ్లలోనూ బెంగళూరు ఓటమిపాలైంది. ఆ సీజన్ లో కోల్ కతా జట్టు విజేతగా ఆవిర్భవించింది. అయితే గత సీజన్లో బెంగళూరు జట్టు సెమీఫైనల్ వరకు వెళ్లడం.. అక్కడ ఓడిపోవడంతో సగటు కన్నడ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు.. అయితే ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని సోషల్ మీడియా వేదికగా బెంగళూరు జట్టు యాజమాన్యానికి సందేశాలు రావడం మొదలైంది. దీంతో బెంగళూరు జట్టు యాజమాన్యం ఐపిఎల్ మెగా వేలం నుంచి కసరత్తు మొదలుపెట్టింది. నాణ్యమైన ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. అందువల్లే తొలి మ్యాచ్లో బెంగళూరుకు అనుకూల ఫలితం వచ్చింది. గత సీజన్లో రెండుసార్లు ఓడించిన కోల్ కతా జట్టుకు తిరుగులేని జవాబు ఇచ్చింది. అయితే గత సీజన్లో కోల్ కతా జట్టు రెండుసార్లు బెంగళూరును ఓడించింది. అయితే తదుపరి మ్యాచ్ లోను కోల్ కతా ను ఓడించి లెక్క సరి చేస్తామని బెంగళూరు ఆటగాళ్లు అంటున్నారు. తొలి మ్యాచ్లో అన్ని రంగాలలో అద్భుతమైన ప్రదర్శన చూపించి బెంగళూరు ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్, బౌలింగ్లో బెంగళూరు ఆటగాళ్లు అదరగొట్టారు. బెంగళూరు తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో ఈసాలా కప్ నమదే అంటూ కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం మొదలు పెడుతున్నారు.