https://oktelugu.com/

KKR Vs RCB: బంతితో కృణాల్..బ్యాట్ తో విరాట్.. బెంగళూరు కమాల్..కోల్ కతా డమాల్..

KKR Vs RCB ఐపీఎల్ 18వ ఎడిషన్ లో బెంగళూరు జట్టు బోణి చేసింది..కోల్ కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘనవిజయం సాధించింది.

Written By: , Updated On : March 23, 2025 / 08:19 AM IST
KKR Vs RCB (1)

KKR Vs RCB (1)

Follow us on

KKR Vs RCB: ఐపీఎల్ 18 ఎడిషన్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో ముందుగా బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇందులో అజింక్య రహానే 56, సునీల్ నరైన్ 44, రఘు వంశీ 30 రన్స్ చేశారు.. బెంగళూరు బౌలర్ లో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. హేజిల్ వుడ్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.

Also Read: కోల్ కతా పై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఈసాలా కప్ నమదేనా.

ఆడుతూ పాడుతూ

కోల్ కతా విధించిన 175 పరుగుల టార్గెట్ ను బెంగళూరు జట్టు ఆడుతూ పాడుతూ చేదించింది.. తొలి వికెట్ కు సాల్ట్ (56), విరాట్ కోహ్లీ (59*), రజత్ పాటిదర్ (34) పరుగులతో ఆకట్టుకున్నారు. కోల్ కతా విధించిన లక్ష్యాన్ని 16.2 ఓవర్ లలోనే బెంగళూరు చేదించడం విశేషం.. మొత్తంగా కోల్ కతా పై 7 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. బెంగళూరు విజయంలో కృణాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ ముఖ్యపాత్ర పోషించారు. బంతితో కృణాల్, బ్యాట్ తో అదరగొట్టారు..కోల్ కతా ఇన్నింగ్స్ సమయంలో కృణాల్ తన మాయజాలంతో ఆకట్టుకున్నాడు.. మెలి తిప్పే బంతులు వేస్తూ కోల్ కతా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.. ఇక ఈ విజయం ద్వారా బెంగళూరు జట్టు బోణి కొట్టింది. గత సీజన్లో చెన్నై జట్టుతో ఆడిన ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది. ఇక గత సీజన్లో కోల్ కతా జరిగిన రెండు మ్యాచ్లలో బెంగళూరు ఓటమిపాలైంది. తాజా విజయంతో నాటి ఓటమికి కోల్ కతా పై బెంగళూరు రివెంజ్ తీర్చుకున్నట్టయింది.

విరాట్ విశ్వరూపం

ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసి కోల్ కతా జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 36 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 59 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ మ్యాచ్ చివరి వరకు ఉన్నాడు. సాల్ట్ తో తొలి వికెట్ కు 95, దేవదత్ తో రెండో వికెట్ కు 23, రజత్ పాటిధార్ తో మూడో వికెట్ కు 44, లివింగ్ స్టోన్ తో నాలుగో వికెట్ కు 15 * పరుగులు జోడించాడు. అంతేకాదు తనలో శక్తి సామర్థ్యాలు మరింత మెరుగ్గా ఉన్నాయని.. తను పరుగుల యంత్రాన్నని… తనతో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యర్థులకు ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ గట్టి హెచ్చరికలు పంపాడు.