KKR Vs RCB 2025: పహల్గాం దాడి తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో.. దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. పైగా తాత్కాలిక విరామం తర్వాత ఐపీఎల్ మొదలవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై పడింది. ఈ మ్యాచ్లో బెంగళూరు కనుక గెలిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుంది. అయితే ఇటీవల కాలం వరకు సొంత మైదానంలో బెంగళూరు జట్టు ఆశించినంత స్థాయిలో విజయాలు సాధించలేదు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ నుంచి ఒక్కసారిగా బెంగళూరు తన గేర్ మార్చింది. వరుసగా విజయాలు సాధించి.. అందులోనూ సొంతమైదానంలో గెలుపులు సొంతం చేసుకొని తిరుగులేని స్థాయిలో నిలబడింది. ఈ క్రమంలో శనివారం జరిగే మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బెంగళూరు జట్టు ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా బెంగళూరు లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక మ్యాచ్ గెలిచిన చాలు.. బెంగళూరు ప్లే ఆఫ్ వెళుతుంది. మిగతా రెండు మ్యాచ్ లు ఆడ దాని కంటే ముందే కోల్ కతా పై విజయం సాధించి ప్లే ఆఫ్ వెళ్లాలని బెంగళూరు భావిస్తోంది.
Also Read: హమ్మయ్య మొత్తానికి క్లారిటీ వచ్చింది… ఐపీఎల్ పది జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే!
మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఆడాలని భావిస్తుంది. ఈ జట్టు లీగ్ దశలో ఆడే అన్ని మ్యాచ్లలో విజయం సాధించాలి. లేకపోతే ఈ జట్టు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.. పైగా గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా మ్యాజిక్ ప్రదర్శించి ప్లే ఆఫ్ వెళ్ళాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే సొంత మైదానంలో ఆడుతున్న నేపథ్యంలో బెంగళూరు జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. పైగా కింగ్ విరాట్ ఈ మ్యాచ్లో అదరగొడతాడని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో బెంగళూరు కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే తనదైన రోజు కోల్ కతా ఎటువంటి సాహసానికైనా వెనుకాడదు. ఇక ఇటీవల కాలంలో ఈ రెండు జట్ల మధ్య 13 మ్యాచులు జరిగాయి. ఇందులో ఎనిమిది బెంగళూరు గెలవగా.. 5 కోల్ కతా గెలిచింది. బెంగళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ 505 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అజింక్య రహనే 375 పరుగులతో కోల్ కతా జట్టు తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు.. హేజిల్ వుడ్ 18 వికెట్లతో బెంగళూరు తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి 17 వికెట్లతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు.. ఇక google ప్రీ డిక్షన్ ప్రకారం బెంగళూరు గెలవడానికి 54, కోల్ కతా గెలవడానికి 46 శాతం అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.