KKR VS PBKS : ఇదే సూత్రాన్ని 2024 ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వాస్తవంలో పెట్టింది. హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి బౌలర్లు అద్భుతాలు చేశారు..స్టార్క్ కూడా లాస్ట్ సీజన్లో ఉండడంతో.. అతడు కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చుక్కలు చూపించాడు. బౌలింగ్ లో అద్భుతాలు చేసింది కాబట్టే.. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఏ జట్టుకు సాధ్యం కాని విజయాలు సొంతం చేసుకొని ఛాంపియన్ గా ఆవిర్భవించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించాడు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా వ్యవహరించాడు.
Also Read : కోట్లకు కోట్లు పెట్టి కొంటే.. ప్రీతిజింటాను ఎందుకిలా ఏడిపిస్తున్నార్రా?
అందువల్లే వదులుకున్నాడు
సాధారణంగా జట్టుకు ట్రోఫీ అందించిన ఏ కెప్టెన్ ను కూడా మేనేజ్మెంట్ వదులుకోదు. కానీ 2025 కు సంబంధించి మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ వదులుకున్నాడు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనం. నిజంగా షారుక్ ఖాన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగ్ అనిపించింది. శ్రేయస్ అయ్యర్ ను రికార్డు ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే షారుక్ ఖాన్ అయ్యర్ ను ఎందుకు వదిలేసుకున్నాడో ఇప్పుడు అర్థం అవుతున్నది. అయ్యర్ ను వదిలేసుకున్నప్పటికీ.. బౌలింగ్ దళాన్ని షారుక్ ఖాన్ డిస్టర్బ్ చేయలేదు. పైగా వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, సునీల్ న రైన్, హర్షిత్ రాణా వంటి బౌలర్లను అట్టే అంటి పెట్టుకున్నాడు. అంటే బౌలింగ్ ను మరింత బలోపేతం చేసి.. సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. అందువల్లే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సీజన్లోనూ అదరగొడుతోంది. టాప్ -4 లో కొనసాగుతోంది. ఇటీవల చెన్నై జట్టుకు, ఇప్పుడు పంజాబ్ జట్టుకు కోలుకోవాలని షాక్ లు ఇచ్చింది. ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ మ్యాచ్లలో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. కానీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు మాత్రం వికెట్ల పంట పండిస్తున్నారు.. అయ్యర్ లాంటి ఆటగాళ్లను వదులుకోవడానికి ఇష్టపడిన షారుఖ్ ఖాన్.. బౌలర్ల విషయంలో మాత్రం ఉదారత చూపించాడు. అంతేకాదు బౌలింగ్ దళాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. పరుగుల వరద పారే ఐపీఎల్ లో వికెట్లను పడగొట్టి చూపిస్తున్నాడు. 200 కు మించి పరుగులు నమోదు అవుతున్న ఐపీఎల్లో మేటి జట్టుగా పేరుపొందిన చెన్నై, యువ రక్తంతో నిండిన పంజాబ్ ను 120 పరుగుల లోపు కట్టడి చేసింది అంటే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ దళం బలం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : శ్రేయస్ అయ్యర్ పై మెత్తపడ్డ బిసిసిఐ.. సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కినట్టేనా..