CSK : చెన్నై జట్టు సోమవారం రాత్రి లక్నోతో తలపడింది. మ్యాచ్ లక్నో జట్టు సొంతమైదానంలో జరుగుతోంది. కానీ ఆ మైదానం మొత్తం పసుపు రంగుతో కనిపించింది. కారణం చెన్నై జట్టు విజయం సాధించాలని.. చెన్నై అభిమానులు భారీగా అక్కడికి తరలివచ్చారు. భారీగా వచ్చిన చెన్నై అభిమానులను చూసి లక్నో జట్టు యాజమాన్యం కూడా షాక్ అయింది. అదేంటి ఆడుతోంది లక్నోలో కదా.. ఇంతమంది చెన్నై అభిమానులు వచ్చారేంటని ఆశ్చర్యపడింది. ఇక ఆ మ్యాచ్లో చెన్నై జట్టు ఉత్కంఠ పరిస్థితిలో విజయం సాధించింది. చివరి వరకు సాగిన ఈ మ్యాచ్లో.. అంతిమంగా విజయం చెన్నై జట్టు వరించింది. ముందుగానే చెప్పినట్టు చెన్నై జట్టుకు, ధోనికి విపరీతమైన అభిమానులు ఉంటారు. ధోని కోసం మాత్రమే మ్యాచ్ చూసేందుకు వచ్చే అపర అభిమానులు లక్షల్లో ఉంటారు. అందుకే వారంతా ధోనిని అత్యంత ప్రేమగా “తలా” అని పిలుచుకుంటారు. ధోని కెప్టెన్ అయిన తర్వాత చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక నిన్న లక్నో దగ్గర ఉన్న మ్యాచ్లో గెలిచిన తర్వాత చెన్నై జట్టు అభిమానులు సోషల్ మీడియాలో చేసిన సందడి మామూలుగా లేదు.
Also Read : శ్రేయస్ అయ్యర్ ను షారుక్ ఎందుకు వదిలేశాడో.. ప్రీతి జింటాకు తెలిసే ఉంటుంది..
జ్యోతిర్లింగాలు దర్శించుకుంటాడట
చెన్నైకి అపర ప్రేక్షకులు ఉంటారు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై ఓటమి పాలైతే కన్నీరు పెట్టుకుంటారు. అదే చెన్నై ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకుంటారు. అయితే చెన్నై అభిమానులు ప్రస్తుత సీజన్లో డీలా పడిపోయారు. చెన్నై వరుసగా మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో గెలవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమ జట్టు ఆటగాళ్లకు సపోర్ట్ ఇవ్వడానికి లక్నో బయలుదేరి వెళ్లిపోయారు. అయితే అలా వెళ్లిపోయిన ఓ అభిమాని చెన్నై జట్టుపై తనకు ఉన్న ప్రేమను అందరికంటే భిన్నంగా ప్రదర్శించాడు. ” చెన్నై జట్టు కనుక ఐపిఎల్ లో మంచి కం బ్యాక్ ఇస్తే.. తాను ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని.. చెన్నై జట్టు ఏడు రోజుల్లో గొప్పగా ఆడాలని” అతడు ఆ ఫ్ల కార్డులో పేర్కొన్నాడు. దీంతో సోషల్ మీడియాలో అతని గురించి చర్చ మొదలైంది. “ఇలాంటి అభిమానులు చెన్నైకి మాత్రమే సొంతం. చెన్నై జట్టు కోసం వారు ఏదైనా చేస్తారు. చెన్నై జట్టు గెలవడానికి తమ వంతుకు మించి పాత్ర పోషిస్తారు. ఆటగాళ్లు నిరుత్సాహానికి గురైనప్పుడు.. వారిలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి అభిమానులు ఉండడం చెన్నై జట్టు చేసుకున్న అదృష్టమని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై జట్టు ఇలాగే విజయాలు సాధించాలని.. 2023 మాదిరిగానే ఛాంపియన్ గా అవతరించాలని కోరుకుంటున్నారు.
Also Read : కోట్లకు కోట్లు పెట్టి కొంటే.. ప్రీతిజింటాను ఎందుకిలా ఏడిపిస్తున్నార్రా?