Khalil Ahmed : ఆంగ్ల జట్టుతో జరుగుతున్న రెండవ అనధికారిక టెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ఆంగ్ల గడ్డపై సత్తా చూపిస్తున్నారు. పదునైన బంతులు వేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కువగా ఆఫ్ స్టంప్ దిశగా బంతులు వేసి ఆంగ్ల బ్యాటర్లకు నరకం చూపించారు.. భారత బౌలర్ల తెలివైన బౌలింగ్ వల్ల ఇంగ్లీష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అంతేకాదు భారీగా పరుగులు చేయకుండా వెనక్కి వచ్చేశారు. తద్వారా రెండవ అనధికారిక టెస్టులో భారత్ విజయం సాధించే దిశగా కనిపిస్తోంది.
రెండవ అనధికారిక టెస్ట్ లో భాగంగా రెండవ రోజు భారత బౌలర్ ఖలీల్ అహ్మద్ దుమ్ము రేపాడు. ఏకంగా నాలుగు వికెట్లు సాధించి ఆంగ్ల జట్టుకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దిశగా పంతులు వేస్తూ ఆంగ్ల జట్టు బ్యాటర్లకు నరకం చూపించాడు.. ఆ బంతులను ఆడ లేక.. వదిలేస్తే వికెట్ పడుతుందనే భయంతో ఆంగ్ల బ్యాటర్లు వణికిపోయారు. దీంతో కడపటి వార్తలు అందే సమయానికి ఆంగ్ల జట్టు 8 వికెట్ల కోల్పోయి 266 పరుగులు చేసింది.. ఖలీల్ అహ్మద్ ఆంగ్ల జట్టులో నాలుగు కీలకమైన వికెట్లను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ప్లాట్ పిచ్ పై అతడు అద్భుతమైన స్వింగ్ రాబట్టాడు. ఆప్ స్టంప్ దిశగా అతడు వేసిన బంతులు అద్భుతం.. అనన్య సామాన్యం.
ఖలీల్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా.. తుషార్ 2 వికెట్లు సాధించాడు. కాంబోజ్, కోటియన్ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 348 పరుగులు చేసింది. ఇండియన్ జట్టులో కేఎల్ రాహుల్ 116 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు అదరు టచ్ లోకి రావడంతో భారత జట్టులో హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఖలీల్ కు మరింత సాన పెడితే అతడు బుమ్రాకు వారసుడవుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు..” ఇంగ్లీష్ గడ్డపై ప్లాట్ పిచ్ పై స్వింగ్ రాబట్టడం చాలా కష్టం. కానీ అహ్మద్ దానిని నిజం చేసి చూపించాడు. ఆంగ్ల జట్టు బ్యాటర్లకు నరకం చూపించాడు. అతడికి మరింత సాన పెడితే టీమిండియా ఆంగ్ల జట్టు పై అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని” క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖలీల్ అహ్మద్ కనుక ఇదే తీరిగా బౌలింగ్ చేస్తే.. ఆంగ్ల జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడు ఇదే తీరుగా రాణించాలని సీనియర్ క్రికెటర్లు ఆకాంక్షిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టుపై అదరగొట్టాలని కోరుతున్నారు.