India Vs West Indies: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటన సిద్ధమవుతోంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులో కీలక మార్పులను మేనేజ్మెంట్ చేస్తోంది. డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓటమి తర్వాత పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నుంచి బయట పడాలంటే ఈ పర్యటనను భారత జట్టు విజయవంతంగా ముగించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా జరిగిన విమర్శలు స్థాయి మరింత పెరిగే అవకాశం ఉండడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. అందులో భాగంగా కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది.
వెస్టిండీస్ పర్యటన భారత జట్టు ఆశావహ దృక్పథంతో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తోంది బిసిసిఐ. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా డబ్ల్యూటీసి ఫైనల్ ఓటమి తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్టమైన జట్టును వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు సిద్ధం చేస్తుంది. అదే సమయంలో గత కొన్నాళ్ల నుంచి విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న పలువురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతిని కల్పించింది.
ఐపీఎల్ లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవకాశం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ ఆటగాళ్లలో కొందరికి వెస్టిండీస్ పర్యటనలో అవకాశం కల్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం ద్వారా ఖాళీ అయిన స్థానాలను జూనియర్లకు అవకాశం కల్పించనుంది బీసీసీఐ. అందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొట్టిన రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు ప్రస్తుతం సెలక్టర్లు చేస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో ఆడనున్న మూడు సిరీస్ లకు ఈనెల 27న జట్టును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
కీలక స్థానాల్లో ప్లేయర్లకు అవకాశం..
టి20 ఫార్మాట్ కు ఎంపిక చేసే జట్టులో ఓపెనర్లుగా గిల్, ఇషాన్ కిషన్ ఎంపిక అవ్వనున్నారు. బ్యాకప్ గా రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీపక్ హుడా స్థానంలో యశస్వి జైస్వాల్ కు అవకాశం కల్పించే యోచనలో బీసీసీఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న జట్టుకు సీనియర్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కొంత బలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ భారాన్ని సూర్య కుమార్ యాదవ్ మోయనున్నాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే వెస్టిండీస్ పర్యటనలో స్పిన్ ప్రభావం కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉండడంతో జట్టులోకి యజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పేస్ దళాన్ని అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ లు నడిపించనన్నారు.