Carrot Juice: మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో క్యారెట్ ఒకటి. చూడటానికి ఆకర్షణీయంగా ఆరెంజ్ రంగులో ఉండే ఈ దుంప మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని జ్యూస్ తాగొచ్చు నమిలి తినొచ్చు. ఎలా తిన్నా దీని ఉపయోగాలు అనేకం. మన శరీరానికి ఎంతో అవసరం. దుంప జాతికి చెందినా ఇందులో పోషకాలుపుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీన్ని రోజు తినాలని వైద్యులు చెబుతున్నారు.
ఇందులో ఉండే బీటా కెరోటిన్ మనక చాలా ఉపయోగపడుతుంది. కొన్ని కూరగాయల్లో బీటాకెరోటిన్ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. దీంతో క్యారెట్ రోజు తినాలని చెబుతుంటారు. కానీ ఇక్కడ ఓ సందేహం వస్తుంది. జ్యూస్ తాగితే మంచిదా నమిలి తింటే లాభమా? అని అందరికి సందేహం రావడం సహజమే.
జ్యూస్ లా తాగడం కన్నా నమిలి తినడమే మంచిది. నములుతుంటే లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది మనం తిన్న పదార్థాలను జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో నమిలి తింటుంటే మన నోటికి కూడా వ్యాయామం అవుతుంది. నాలుగు క్యారెట్లు తినడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. కానీ జ్యూస్ ఒక నిమిషంలో తాగేయొచ్చు.
ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లేవారు క్యారెట్ ను జ్యూస్ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే వారికి సమయం ఉండదు. మిగతా వారు మాత్రం నమిలి తినడమే శ్రేయస్కరం. ఇలా క్యారెట్ ను నమిలి తింటుంటేనే మజా వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. క్యారెట్ ను జ్యూస్ గా కంటే నమిలి తింటేనే అధిక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.