https://oktelugu.com/

IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం

IPL 2022: బీసీసీఐ 2022 ఐపీఎల్ కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో మ్యాచ్ ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో బీసీసీఐకి భారీ నష్టమే చవిచూసింది. ప్రస్తుతం కూడా పెరుగుతున్న కరోనా కేసులతో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. దీనికి గాను నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటోంది. లీగ్ మ్యాచ్ ల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. మ్యాచ్ ల […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2022 / 03:02 PM IST
    Follow us on

    IPL 2022: బీసీసీఐ 2022 ఐపీఎల్ కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో మ్యాచ్ ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో బీసీసీఐకి భారీ నష్టమే చవిచూసింది. ప్రస్తుతం కూడా పెరుగుతున్న కరోనా కేసులతో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. దీనికి గాను నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటోంది. లీగ్ మ్యాచ్ ల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.

    IPL 2022

    మ్యాచ్ ల నిర్వహణకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు రెండు ప్లాన్ లు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అన్ని మ్యాచ్ లు పది కేంద్రాల్లో జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. పది జట్లకు హోం గ్రౌండ్ మ్యాచ్ లు నిర్వహించేలా శ్రద్ధ తీసుకుంటోంది. దీనికి ముంబైలోని వాంఖడే, సీసీఐ, డీవై పాటిల్ స్టేడియాల్లో జరిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

    Also Read: సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. గెలుపు డిసైడ్ అయ్యేది నేడే.. ఏం జరుగనుంది?

    దీని కోసం ప్లాన్ ఏ, బీ అమలు చేయాలని చూస్తోంది. ఏ లో కొన్ని స్థలాలు, బీ లో కొన్ని సెంటర్లు ఉండేలా ఏర్పాట్లు చేసుకుంది. కరోనా కేసుల దృష్ట్యా టోర్నమెంట్ల నిర్వహణపై సముచితంగానే ఆలోచించేందుకు నిర్ణయించింది. అయితే ముంబైలో మాత్రమే ఆటలు ఉండాలని చూస్తోంది. దీని కోసం కొన్ని మార్పులు చేస్తోంది. బీసీసీఐ నిర్ణయంతో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

    మ్యాచ్ ల తేదీలను కూడా ఖరారు చేస్తోంది. ఏప్రిల్ 2కు బదులు మార్చి 25 నుంచే ఐపీఎల్ మ్యాచ్ లు ఉండాలని చెబుతోంది. కరోనా విజృంభన నేపథ్యంలో ఐపీఎల్ పై పలు కోణాల్లో ఆలోచిస్తోంది. మ్యాచ్ ల నిర్వహణతో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టింది.

    Also Read: తెలంగాణలో కోర‌లు చాస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా..?

    Tags