karnataka liquor sales : కన్నడ జట్టు ఐపిఎల్ విజేతగా ఆవిర్భవించిన తర్వాత సంబరాలు అంబరాన్ని అంటాయి. బెంగళూరు నగరంలో మంగళవారం రాత్రి బాణాసంచా చప్పుళ్ళు హోరెత్తించాయి.. ఒక రకంగా మండు వేసవిలో దీపావళి పండుగను కళ్ళ ముందు కనిపించేలా చేశాయి. ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలలో చాలావరకు తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చాయి. ఇక హోటళ్లు, రిసార్టులు, పబ్ లు ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశాయి. అంతేకాదు ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ప్రకటించాయి. మొత్తంగా తమ జట్టు ఫైనల్ చేరుకున్న నేపథ్యంలో.. దానిని క్యాష్ చేసుకున్నాయి.. ఆఫర్లతో ఆకట్టుకున్నాయి. దీంతో తిన్నంత తిండి.. తాగినంత తాగుడు అన్నట్టుగా బెంగళూరులో పరిస్థితి మారిపోయింది. మద్యం తాగడం.. చిందులు వేయడం పరిపాటిగా మారిపోయింది. స్త్రీలు, పురుషులు అని తేడా లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు.. కన్నడ జట్టు గెలుపొందిన తీరును ఆస్వాదించారు.
కన్నడ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో సరిగ్గా మంగళవారం నాడు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. చివరి అంచె పోటీలో గెలవడంతో కన్నడ జట్టు అభిమానులు మద్యం తాగితే మ్యాచ్ మొత్తాన్ని ఆస్వాదించారు. ఫలితంగా కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం ఒక్క నాడే దాదాపు 160 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. భారీగా బీరు బాక్సులు అమ్ముడుపోయాయి. ఇక ఇతర లిక్కర్ బ్రాండ్ల ద్వారా బీభత్సమైన ఆదాయం లభించింది. మద్యం అమ్మకాలలో సింహభాగం బెంగళూరులోనే చోటుచేసుకున్నాయి. ఇక మంగళూరు, మైసూరు, బళ్లారి ప్రాంతాలలో మద్యం విక్రయాలు ఎక్కువ జరిగాయి.. సుదీర్ఘకాలం తర్వాత కన్నడ జట్టు ఐపిఎల్ గెలిచిన నేపథ్యంలో అభిమానులు ఆ సందర్భాన్ని గొప్పగా జరుపుకున్నారు. మద్యం తాగుతూ.. చిందులు వేశారు.
కన్నడ జట్టు గెలిచిన తర్వాత అభిమానులు రోడ్లమీదకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. డబ్బు చప్పులతో, డీజే శబ్దాలతో డ్యాన్సులు చేశారు. ఆకాశమే హద్దు అన్నట్టుగా వీరవిహారం చేశారు.. కొన్ని ప్రాంతాలలో అభిమానులు శృతిమించి వ్యవహరించారు. ప్రయాణికులకు.. ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగించారు. తద్వారా కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అయితే అటువంటి వ్యక్తులను పోలీసులు చెదరగొట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత నిర్వహించారు. ఇక ఇదే సమయంలో మద్యం తాగిన కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి.. చాలా ప్రాంతాలలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో చాలామంది పోలీసులకు దొరికిపోయారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు మాత్రమే కాకుండా.. అంతే సంఖ్యలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం విశేషం.