Kane Williamson: మైదానంలో ప్రశాంతంగా ఉండే కేన్ విలియమ్సన్.. జెంటిల్మెన్ ఆట తీరని ప్రదర్శించే ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్… సఫారీలపై దూకుడు కొనసాగిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఫ్యాబ్ 4 లో ఒకడైన కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో శతకాల మీద శతకాలు బాదుతున్నాడు. న్యూజిలాండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాదిన కేన్.. రెండో టెస్టులోనూ వంద పరుగులు చేశాడు. దీంతో ఇప్పటిదాకా 32 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతేకాదు అతనికంటే తక్కువ ఇన్నింగ్స్ ల్లోనే విలియమ్సన్ 32 సెంచరీల మైలురాయి అందుకున్నాడు. విలియమ్సన్ 172 ఇన్నింగ్స్ ల్లో ఈ అరుదైన ఘనత సాధించాడు. స్మిత్ మాత్రం 174 ఇన్నింగ్స్ ల్లో 32 సెంచరీలు సాధించాడు.
దక్షిణాఫ్రికా తో బే ఓవల్ లో తొలి టెస్ట్ జరిగింది. మొదటి ఇన్నింగ్స్ లో విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఆ శతకంతో అతడు క్రికెట్ దిగజం డాన్ బ్రాడ్ మాన్ రికార్డు బ్రేక్ చేశాడు. దాంతోపాటు ఫ్యాబ్_4 లో ఉన్న విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఘనతను అధిగమించాడు. రెండవ ఇన్నింగ్స్ లోనూ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో శతకంతో కదం తొక్కాడు. ఈ శతకంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఏకంగా మూడవ వందతో ఆల్ టైం రికార్డ్ సమం చేశాడు. విలియమ్సన్ సెంచరీ తో న్యూజిలాండ్ విజయానికి మరింత చేరువైంది. ఇప్పటికే మొదటి టెస్టును గెలుచుకున్న న్యూజిలాండ్.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే 2_0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.
దక్షిణాఫ్రికా బౌలర్లు మిగతా న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నప్పటికీ…కేన్ విషయానికి వచ్చేసరికి తేలిపోతున్నారు. పైగా అతడు వన్డే స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. తాజా సెంచరీని అతడు 203 బంతులు ఎదుర్కొని చేశాడు. కేన్ సెంచరీ చేసిన నేపథ్యంలో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
Kane Wiliamson cannot help himself
Third of the series, seventh in seven Tests
https://t.co/S8tTDHON3G | #NZvSA pic.twitter.com/liPnPwa6iu
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024