spot_img
Homeక్రీడలుక్రికెట్‌Jos Buttler Son Funny Video: జోస్ బట్లర్ కుమారుడు చేసిన పని.. చూస్తే నవ్వాపుకోలేరు

Jos Buttler Son Funny Video: జోస్ బట్లర్ కుమారుడు చేసిన పని.. చూస్తే నవ్వాపుకోలేరు

Jos Buttler Son Funny Video: చిన్నపిల్లలు చేసే పని నవ్వు తెప్పిస్తుంటాయి. వారి మాటలు.. అడుగులు.. అన్ని ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఈ ఆనందాన్ని గుజరాత్ జట్టు ప్లేయర్లకు.. విమానాశ్రయ సిబ్బందికి కలిగించాడు బట్లర్ కుమారుడు. బట్లర్ ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బట్లర్ కు ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు.

బట్లర్ కుమారుడు పేరు చార్లీ. ఇతడు 2024 లో జన్మించాడు. ప్రస్తుతం బట్లర్ రాజస్థాన్ జట్టుకు ఆడుతున్న నేపథ్యంలో.. సోమవారం జట్టు సభ్యులు విమానాశ్రయం కి వెళ్లారు. తమ తదుపరి మ్యాచ్ ఆడేందుకు వారు ఆ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు కోచ్ నెహ్ర లగేజీ ట్రాలీ తీసుకెళ్తుండగా బట్లర్ కుమారుడు వెనకనుంచి హెల్ప్ చేశాడు. బుడిబుడి అడుగులు వేస్తూ లగేజీ వెనక వెళ్ళాడు. దీంతో గుజరాత్ జట్టు సభ్యులకు.. విమానాశ్రయ సిబ్బందికి ఆ సంఘటన నవ్ తెప్పించింది. ఆ తర్వాత హోటల్ సిబ్బంది సంప్రదాయం ప్రకారం బట్లర్ కుమారుడికి చిన్న పూలదండ వేశారు.. చార్లీ లగేజీ నెట్టుకుంటూ వెళ్తుండగా బట్లర్ వెనక నుంచి కమాన్ కమాన్ మై బాయ్ అంటూ ప్రోత్సహించారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

బట్లర్ ఐపిఎల్ చరిత్రలో 4వేల పరుగులు చేసిన ఐదవ విదేశీ ఆటగాడు. గడచిన పది సీజన్లలో అతడు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 2016లో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రవేశించి తన ఐపిఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2017లో ముంబై జట్టు టైటిల్ గెలవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రయాణం కొనసాగించాడు.. 2018 ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండవ ఆటగాడు. 2022లో ఒకే సీజన్లో 4 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ రికార్డును సమానం చేశాడు.

ఇక ఇంగ్లాండ్ జట్టు క్రికెట్లో కూడా బట్లర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. 2022లో ఇంగ్లాండ్ జట్టు ఐసిసి టి20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గత ఏడాది జరిగిన మెగా వేలంలో గుజరాత్ జట్టు బట్లర్ ను 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంవత్సరం ఒక ఫారిన్ ప్లేయర్ కు లభించిన హైయెస్ట్ ట్రేడ్ అదే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version