Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital 2024 Notification: అమరావతికి చట్టబద్ధత : '2024 జూన్ 2' నోటిఫై ఎందుకంటే

Amaravati Capital 2024 Notification: అమరావతికి చట్టబద్ధత : ‘2024 జూన్ 2’ నోటిఫై ఎందుకంటే

Amaravati Capital 2024 Notification: ఏపీ( Andhra Pradesh) ప్రజల ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయగా.. న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ రెండు నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అమరావతి గెజిట్ నోటిఫికేషన్ లో 2024 జూన్ రెండు నుంచి రాజధానిగా గుర్తించినట్టు పేర్కొనడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అదే తేదీ నుంచి ఎందుకు అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

* పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి ఏపీకి హైదరాబాద్( Hyderabad) రాజధానిగా ఉండేది. అయితే విభజన తర్వాత కూడా అంటే 2014 నుంచి 2024 వరకు పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచారు. అయితే ఆ గడువు 2024 జూన్ 2 తో ముగిసింది. ఈ క్రమంలోనే 2024 జూన్ రెండు నుంచి అమరావతి ఏకైక రాజధానిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

* రెండు కారణాలతో..
అయితే ఈ నిర్ణయం వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుకు ఇచ్చిన గడువు ముగియడం ఒకటి అయితే.. మూడు రాజధానుల ఎపిసోడ్ కు చెక్ పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయింది. రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చట్ట సవరణపై స్పష్టత ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో రాజధాని అమరావతి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం కట్టబెట్టారు. శాసనసభలో సవరణ చేసి మార్పు చేస్తామంటే కుదిరే పని కాదు.

* అసలు విషయం తెలియక..
అయితే అంతా మూడు రాజధానులకు ( three capitals )చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే అమరావతికి చట్టబద్ధత కల్పించారని భావించారు. కానీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు ఉన్న గడువు ముగిడంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఎంతవరకు మూడు రాజధానులకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే.. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుకున్నారు. కానీ 2024 జూన్ 2 తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిందని కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Oktelugu Epaper
Exit mobile version