Jos Buttler: ఐపీఎల్ సీజన్ 17 చాలా రసవత్తరంగా సాగుతుంది. ఒక టీం ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేస్తే మరొక టీం వచ్చి దాన్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది. అలాంటి ఒక అసాధ్యమైన ఆటతీరుని కనబరుస్తూ ప్రతి టీం తమ సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే నిన్న కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ లా మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ టీం ఓపెనర్ ప్లేయర్ అయిన “జోస్ బట్లర్” అద్భుతమైన సెంచరీ ని సాధించి టీమ్ ను విజయతీరాలకు చేర్చాడు. ఇక బట్లర్ (107 నాటౌట్) సెంచరీ చేయడంతో రాజస్థాన్ టీం విజయం సాధించడమే కాకుండా అంతకు ముందు కలకత్తా టీం బ్యాటింగ్ చేసినప్పుడు అద్భుతమైన సెంచరీ చేసిన సునీల్ నరైన్ శతకం అనేది వృథా గా మిగిలిపోయింది…ఇక ఇప్పటికే జోస్ బట్లర్ ఈ సీజన్ లో రెండు సెంచరీ లను నమోదు చేసుకున్నాడు.
తను ఎప్పుడైతే రెండు సెంచరీలను చేశాడో, ఆ రెండు సెంచరీలు చేసిన సమయంలో టీమ్ ను విజయతీరాలకు చేర్చడమే కాకుండా ప్రత్యర్థి టీమ్ లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు చేసిన సెంచరీలను కూడా వృథా అయ్యేలా చేశాడు. ఇక అసలు విషయానికి వస్తే ఏప్రిల్ 6 వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ లా మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం లో విరాట్ కోహ్లీ 113 పరుగులు చేసి ఒక అద్భుతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆ టీమ్ ఆ మ్యాచ్ లో 184 పరుగులు చేయడం విశేషం..
ఇక చేజింగ్ కి వచ్చినా రాజస్థాన్ రాయల్స్ టీం ప్లేయర్లు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతున్నప్పటికీ, బట్లర్ మాత్రం ఒంటరి పోరాటం చేసి చివరి బాల్ కి తను సెంచరీ ని నమోదు చేయడమే కాకుండా టీమ్ ను విజయతీరాలకు కూడా చేర్చాడు…ఇక దానివల్ల ఆ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ వృథా అయిపోయింది. అలాగే నిన్న కలకత్తా తో జరిగిన మ్యాచ్ లో సునీల్ నరైన్ 109 పరుగులు చేశాడు.బట్లర్ దెబ్బ కి నరైన్ సెంచరీ కూడా వృథా అయిపోయిందనే చెప్పాలి…