MS Dhoni – John Cena : జాన్ సీనా పోస్టులో ఎంఎస్ ధోని..  ఏం ఫాలోయింగ్ రా బాబూ

ధోనీ ఫోటోను షేర్ చేశాడు. జాన్ సీనా ఇచ్చే ' యు కాంట్ సీ మీ ' అనే పోజ్ కి సరిపడేలా ఉన్న ధోని ఫోటోలను తన ఇన్ స్టా నుంచి పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. 

Written By: BS, Updated On : May 7, 2023 1:30 pm
Follow us on

MS Dhoni – John Cena : క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిటైర్మెంట్ తరువాత కూడా అభిమానులు పిచ్చిగా ధోనీని ఆరాధిస్తున్నారు. అటువంటి ధోనీకి సంబంధించిన మరో విషయం ఇప్పుడు అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. అదేంటో మీరూ ఒక లుక్కేయండి.
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్రసింగ్ ధోనికి క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను కలిగిన క్రికెటర్లలో ధోనీ ముందంజలో ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు అది అమెరికాలోని డబ్ల్యుడబ్ల్యుఈకి కూడా వ్యాపించినట్లు కనిపిస్తోంది. 16 సార్లు డబ్ల్యుడబ్ల్యుఈ ఛాంపియన్ గా రెజ్లింగ్ రికార్డ్ ల్లో నిలిచిన జాన్ సీనా.. తాజాగా ధోనీ ఫోటోను షేర్ చేశాడు. జాన్ సీనా ఇచ్చే ‘ యు కాంట్ సీ మీ ‘ అనే పోజ్ కి సరిపడేలా ఉన్న ధోని ఫోటోలను తన ఇన్ స్టా నుంచి పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.
లక్నోతో మ్యాచ్ అనంతరం ధోని ఫోజ్.. 
లక్నో సూపర్ జెయింట్స్ తో రద్దయిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ధోనీ ‘ యు కాంట్ సీ మీ ‘ అన్నట్టుగా ఫోజు ఇచ్చాడు. ధోని ఫోటోలను సీనా షేర్ చేయడంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు, భారత్ లోని డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సీనా పోస్ట్ పై తెగ స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అయితే, సీనాకి ఉన్న ఓ చెడ్డ అలవాటు ఏమిటంటే.. తను షేర్ చేసే ఏ ఫోటోలకు కూడా క్యాప్షన్ రాయడు. ధోనీ ఫోటోపై లేదా ధోని గురించి సీనా క్యాప్షన్ రాయకపోవడంతో కొందరు అభిమానులు నిరాశపడ్డారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కొందరు కామెంట్లు కూడా దీని గురించి చేస్తున్నారు.
ముంబైపై ఎట్టకేలకు విజయం సాధించిన చెన్నై జట్టు.. 
ఇకపోతే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది.13 ఏళ్ల నిరీక్షణ తరువాత చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ముంబై జట్టును ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు ఆడిన 11మ్యాచ్ ల్లో చెన్నై జట్టు ఆరు విజయాలను సాధించింది. మరో వైపు జాన్ సీనా ప్రస్తుత కాలంలో రెజ్లింగ్ కు కొంచెం దూరంగా ఉంటున్నాడు. సినిమాలతో బిజీగా ఉన్నడని పలు కథనాలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్పష్టత లేదు.