Naga Chaitanya : అలాంటి పనికిమాలిన డైరెక్టర్ ని నా జీవితం లో చూడలేదు : నాగచైతన్య

'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ అప్పట్లో నాగ చైతన్య తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు.మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభం కావాలి.నాగ చైతన్య డేట్స్ కూడా ఇచ్చేసాడు, కానీ పరశురామ్ ఇంతలోపే విజయ్ దేవరకొండ తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకొని, అతనితోనే తన తదుపరి చిత్రం అని ప్రకటించాడు.అందువల్ల నాగ చైతన్య ఇచ్చిన డేట్స్ మొత్తం వేస్ట్ అయిపోయాయి.

Written By: Vicky, Updated On : May 7, 2023 1:46 pm
Follow us on

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కస్టడీ 12 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉన్న సంగతి తెలిసిందే.తెలుగు తో పాటుగా తమిళం లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కోబోతుంది.వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, తమిళ సీనియర్ హీరో అరవింద్ గో స్వామీ విలన్ గా మరియు శరత్ కుమార్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే విడుదల కాగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక సినిమా విడుదల తేదీ దగ్గరకి వస్తుండడం తో నాగ చైతన్య వరుసగా ఇంటర్వ్యూస్ మరియు మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఎప్పుడూ కూల్ గా ఉండే నాగ చైతన్య ఒక డైరెక్టర్ విషయం లో ఇంత ఓపెన్ గా చిరాకు పడుతూ మాట్లాడడం ఎప్పుడూ జరగలేదు, అసలు విషయానికి వస్తే ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ అప్పట్లో నాగ చైతన్య తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు.మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభం కావాలి.నాగ చైతన్య డేట్స్ కూడా ఇచ్చేసాడు, కానీ పరశురామ్ ఇంతలోపే విజయ్ దేవరకొండ తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకొని, అతనితోనే తన తదుపరి చిత్రం అని ప్రకటించాడు.అందువల్ల నాగ చైతన్య ఇచ్చిన డేట్స్ మొత్తం వేస్ట్ అయిపోయాయి.

అప్పటి నుండి నాగ చైతన్య కి పరుశురాం అంటే ఒక రేంజ్ లో కోపం ఏర్పడింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి ఆ డైరెక్టర్ పేరు ప్రస్తావించగానే నాగ చైతన్య మాట్లాడుతూ ‘అతని పేరు నా దగ్గర ఏత్తకండి.నా సమయం మొత్తాన్ని వృధా చేసాడు, అలాంటి వాడి గురించి మాట్లాడడం వల్ల నా టైం వేస్ట్, మీకు కూడా టైం వేస్ట్’ అని చెప్పుకొచ్చాడు.