Jitesh Sharma batting vs PBKS : పంజాబ్ గడ్డపై.. పంజాబ్ జట్టును ఓడించి ఫైనల్ వెళ్ళింది.. ఐపీఎల్ ట్రోఫీకి ఒక స్టెప్ దూరంలో నిలిచింది.. గత మూడు పర్యాయాలు ఐపీఎల్ ఫైనల్ వెళ్లినప్పటికీ బెంగళూరు ట్రోఫీలు అందుకోలేకపోయింది. దీంతో అత్యంత నష్టదాయకమైన జట్టుగా ముద్ర వేసుకుంది. ఐపీఎల్ లో స్ట్రాంగ్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎక్కడో తేడా కొట్టి బెంగళూరు ట్రోఫీ అందుకోలేకపోతోంది. విజేతగా నిలువలేక పోతోంది. ఈ సమయంలో ఈసారి ఎలాగైనా టోపీ అందుకోవాలని బెంగళూరు భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ సీజన్లో ప్రారంభం నుంచి చివరి చివరి వరకు.. కొన్ని మ్యాచ్లు మినహా.. మిగతా అన్నింటిలోనూ దుమ్మురేపింది. ముఖ్యంగా టాప్ -2 కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. గెలిచి చూపించింది. ప్రత్యర్థి జట్టు విధించిన 200 పైకి పరుగుల లక్ష్యాన్ని చేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ ఐపీఎల్లో ప్రత్యర్థుల మైదానాలలో జరిగిన మ్యాచ్లలో ఏడింటికి ఏడూ విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ లో ఈ ఘనత అందుకున్న తొలి జట్టుగా రికార్డు అందుకుంది. ఇక గురువారం జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ వెళ్లిన బెంగళూరు.. కన్నడ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ ఉత్సాహం ఎల్లలు దాటడానికి ప్రధాన కారణం సాల్ట్ కాదు.. హేజిల్ వుడ్ కాదు.. ఇంకెవరంటే..
Also Read : ఆర్ సీబీ కప్ గెలవకపోతే తన భర్తకు విడాకులిస్తుందట: వైరల్ వీడియో
బెంగళూరు టాప్ -2 లోకి వెళ్లాలంటే గెలవక తప్పని పరిస్థితి. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో బెంగళూరు హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి ఈ ఓటమిని బెంగళూరు జట్టు ఊహించలేదు. కానీ అనూహ్యమైన రీతిలో హైదరాబాద్ ప్లేయర్లు రెచ్చిపోవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఇక ఈ ఓటమితో లక్నో జట్టుపై గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుకు ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 227 స్కోర్ చేసేసింది. వాస్తవానికి ఈ టార్గెట్ ఫినిష్ చేయడం ఒక రకంగా బెంగళూరుకు ఇబ్బందికరంగానే మారింది. తొలి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదైనప్పటికీ.. ఆ తర్వాత వెంటవెంటనే నాలుగు వికెట్లు పోయాయి. దీంతో 90 పరుగుల వద్ద నలుగురు కీలక ప్లేయర్లను కోల్పోయి బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ ఆదుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన భీకరమైన బ్యాటింగ్ తో లక్నో బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు ఏకంగా 85 పరుగులు చేశాడు. కడవరకు క్రీజ్ లోనే ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఐదో వికెట్ కు మయాంక్ అగర్వాల్ తో కలిసి జితేష్ శర్మ అజేయమైన 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఓడిపోయో మ్యాచ్ లో గెలిపించి బెంగళూరును టాప్ -2 లోకి తీసుకుపోవడం ద్వారా.. ఆ జట్టులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. తద్వారా సెమి ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ గడ్డపై పంజాబ్ జట్టును ఓడించి ఫైనల్ వెళ్ళింది. అయితే బెంగళూరు ఈ స్థాయి దాకా రావడానికి జితేష్ శర్మ ప్రధాన కారణమని సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. అతడికి గుడి కట్టినా తప్పు లేదని.. జేజేలు పలికినా అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.