Viral video : బెంగళూరు ఫైనల్ చేరిన ఆనందంలో ఆ జట్టు అభిమానులు ఎగిరి గంతులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈసారి కప్పు మేము సొంతం చేసుకుంటామని వ్యాఖ్యలు చేస్తున్నారు. 2025 సీజన్ కంటే ముందు బెంగళూరు మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ కి వెళ్ళింది. మూడుసార్లు కూడా ఓటమిపాలై రన్నరప్ తో సరిపెట్టుకుంది. దీంతో బెంగళూరు జట్టు ఆ సమయంలో తీవ్రంగా విమర్శలపాలైంది. దురదృష్టకరమైన జట్టు అని ముద్ర వేసుకుంది. కానీ ఈసారి ఆ ముద్రను చెరిపి వేసుకోవడానికి బెంగళూరు జట్టు ఆటగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అదరగొడుతున్నారు. ముఖ్యంగా సెమి ఫైనల్ మ్యాచ్లో అయ్యర్ ఆధ్వర్యంలోని పంజాబ్ బృందంపై దుమ్మురేపారు. ప్రతి విభాగంలోనూ సత్తా చూపించి అదరగొట్టారు. మొత్తంగా వారి సొంత మైదానంలోనే ఓడించి సంచలనం సృష్టించారు.
పంజాబీ జట్టుపై గెలిచిన తర్వాత బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆకాశమే హద్దుగా వారు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో దుమ్ము రేపి వదిలిపెడుతున్నారు. ఐపీఎల్ లో బెంగళూరు విజయ యాత్ర ఈ సీజన్ నుంచి మొదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు..” మా ఆటగాళ్ళు మా అంచనాలను అందుకున్నారు. మా ఆశలను నెరవేర్చారు. మా కలలను నిజం చేశారు. ఈ జన్మకు ఇది చాలు. అసలు ఇక్కడిదాకా వస్తుందని కలలో ఊహించలేదు. మా జట్టు ప్రయాణం ఈ సీజన్లో అద్భుతంగా ఉంది. దేవుడు ఇన్ని రోజులకు మామూలు ఆలకించాడు. మాకు అనుకూలంగా మా జట్టును ఆడే విధంగా తోడ్పాటు అందించాడు. ఇంతకుమించిన గొప్ప విషయం మాకు మరొకటి ఉండదంటూ” బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మహిళా అభిమాని ప్రదర్శించిన పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు కనక గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తానంటూ ఆమె అందులో రాసుకొచ్చారు. ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ” బెంగళూరు ఎలాగూ కప్ గెలుస్తుంది. మీ నిర్ణయాన్ని మార్చుకోండి” అని కొంతమంది కామెంట్ చేస్తుంటే..” ఫైనల్ వెళ్లినప్పటికీ బెంగళూరు గెలవదని గట్టి నమ్మకంతో ఉన్నట్టుంది. పాపం అందు గురించే తన భర్తకు విడాకులు ఇస్తానంటోంది.. అన్నట్టు ఆమె భర్తతో విభేదాలు ఉంటే.. నేరుగా విడాకులు ఇవ్వచ్చు కదా.. మధ్యలో బెంగళూరు ప్రస్తావన ఎందుకంటూ” మరి కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఆమె ప్రదర్శించిన ఫ్లకార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కొంతమంది అయితే ఆమెకు పెళ్లి కాలేదని.. అందువల్లే ఇంత ధైర్యంగా ఫ్ల కార్డు ప్రదర్శిస్తున్నదని ఇంకొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.