Jemimah Rodrigues: ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత జెమీమా ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. వాస్తవానికి అంతకుముందు ఆమె అద్భుతమైన ఇన్నింగ్స్ లు అనేకం ఆడినప్పటికీ.. ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్ మ్యాచ్ కావడం.. జట్టు అవసరాలకు తగ్గట్టుగా సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో.. ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగిపోతుంది.
జెమీమా 2000 సంవత్సరంలో ముంబైలో జన్మించింది.. ఈమెకు నాలుగు సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ మీద విపరీతమైన ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత అందులో విపరీతంగా సాధన చేసేది.. చిన్నతనంలో ఆమెకు తండ్రి కోచ్ గా వ్యవహరించేవాడు. టీనేజ్ వయసులో కూడా అతడే ఆమెకు శిక్షకుడిగా వ్యవహరించాడు. అందువల్లే ఆమె తన తండ్రిని హీరోగా చెబుతుంటుంది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు జెమీమా కు హాకీ అంటే చాలా ఇష్టం. మహారాష్ట్రలో అండర్ 17, అండర్ 19 జట్లకు ఆమె ప్రాతినిధ్యం వహించింది. బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇష్టంగా ఆడుతుంది.
ఖాళీ సమయంలో వంట చేస్తుంది. నచ్చిన రిసిపిలను వండుకొని తింటూ ఆస్వాదిస్తూ ఉంటుంది. రేసింగ్ కూడా ఇష్టపడుతుంది. సమయం దొరికితే చాలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రేసింగ్ కు వెళ్తుంది.. ప్రయాణాలు చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ముఖ్యంగా లండన్ ప్రాంతంలో వివరించడం ఆమెక విపరీతమైన ఇష్టం. ప్రకృతి మధ్యలో గడపడాన్ని ఆమె ఆస్వాదిస్తూ ఉంటుంది. ట్రెక్కింగ్ వెళ్లి.. అక్కడ దృశ్యాలను ఫోటోలు తీస్తూ ఉంటుంది. వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. బీచ్ లో సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం జెమీమా కు చాలా ఇష్టం.
Also Read: వద్దన్నా.. జెమీమానే గెలిపించింది.. గుండెలు బరువెక్కించే కథ ఇది!
డ్యాన్స్ చేసి ఒత్తిడిని తగ్గించుకుంటుంది. ఫ్రెండ్స్ తో సరదాగా రీల్స్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. పుస్తకాలు చదువుతూ.. కాఫీ తాగుతూ తనకున్న ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. క్రికెటర్ రోహిత్ శర్మ అంటే ఇష్టపడే జెమీమా.. సచిన్ టెండూల్కర్ ను స్ఫూర్తి అని చెబుతూ ఉంటుంది. జెమీమా ను ఇంస్టాగ్రామ్ లో 19 లక్షల మంది అనుసరిస్తున్నారు. స్మృతి తో జెమీమా కు స్నేహం ఉంది. వీరిద్దరూ స్నేహితుల కంటే సొంత సోదరీమణులు అనడం సబబు.