Homeజాతీయ వార్తలుCloud Seeding: కోట్లు ఖర్చు పెట్టినా రిజల్ట్‌ జీరో.. పెట్టుబడంతా ఆకాశంలో పోసిన పన్నీరే!

Cloud Seeding: కోట్లు ఖర్చు పెట్టినా రిజల్ట్‌ జీరో.. పెట్టుబడంతా ఆకాశంలో పోసిన పన్నీరే!

Cloud Seeding: ప్రభుత్వాలు పెట్టుబడి పెడితే.. తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరాలని, ఆదాయం రావాలని, పర్యాటకులను ఆకర్షించాలి అని భావిస్తాయి. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తాయి. బడ్జెట్‌ అంచనా వేస్తాయి. పనులు చేపట్టే కాంట్రాక్టర్‌/ఏజెన్సీ పనితీరు తెలుసుకుంటారు. తర్వాతే ముందుకు వెళ్తారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. కానీ ఫలితం మాత్రం తీవ్ర నిరాశపర్చింది. పెట్టుబడి అంతా ఆకాశంలో పోసిన పన్నీరైంది. కొన్నేళ్లుగా కాలుష్యంతో దేశ రాజధాని శీతాకాలంలో కాలుష్యంతో సతమతమవుతోంది. ప్రజలు వ్యాధులుబారిన పడుతున్నారు. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ.3.2 కోట్లతో క్లౌడ్‌ సీడింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ఐఐటీ కాన్పూర్‌ సహకారంతో మూడు ట్రయల్స్‌ నిర్వహించారు. అయితే, ఒక్క చుక్క వర్షం కూడా రాలేదు. అక్కడి వాతావరణంలో తక్కువ మేఘాల తేమ (10–20%) ఉన్న కారణంగా ఈ ప్రయోగం విఫలమైంది. సాధారణంగా క్లౌడ్‌ సీడింగ్‌కు 50% పైగా తేమ అవసరం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

భారీ ఖర్చు.. జీరో రిజల్ట్‌..
ప్రతి ట్రయల్‌కి సాధారణంగా రూ.35–64 లక్షలు ఖర్చు అయ్యింది. మొత్తం 9 ట్రయల్స్‌ కోసం రూ.3.21 కోట్లు కేటాయించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇది విఫలమైనా ఇంకా మరో ప్రయోగాల కోసం ప్రణాళికలు కొనసాగడం విమర్శలకు దారితీస్తోంది. ఖర్చు చేసినప్పటికీ, ఎలాంటి వర్షం లేకపోవడం నిరాసక్తత కలిగించింది. పరిశోధన సంస్థలు ఈ విధానం తాత్కాలికమే అని స్పష్టం చేశాయి. వర్షం కురిస్తే చిన్నకాలం కాలుష్యం తగ్గొచ్చు, కానీ మళ్లీ రెండు రోజుల్లో కలుషిత స్థాయి పెరుగుతుంది. ఇందులో పెట్టుబడి పెడితే, అసలు కాలుష్య మూలాలను పరిష్కరించేందుకు దృష్టి దూరమవుతుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వ వ్యూహంలో రాజకీయ ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీ కాలుష్యానికి క్రమంగా పరిష్కారం లభించాలంటే, వాస్తవికంగా ప్రాథమిక కాలుష్య మూలాలపై దష్టిసారించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అంతిమంగా, కృత్రిమ వర్ష ప్రయోగాలు ఢిల్లీ కాలుష్యాన్ని తరచూ తగ్గించలేకపోవడం ఖర్చుతో కూడుకున్న ఆశప్రయత్నంగా మిగిలింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version