Jay Shah ICC Statement On Pakistan And Bangladesh: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ ఆడే జట్లు జెంటిల్మెన్ తీరును ప్రదర్శించాలి. కానీ, కొన్ని జట్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాయి. క్రికెట్ నిబంధనలు పక్కన పెట్టి మూర్ఖంగా వ్యవహరిస్తుంటాయి. ఈ జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రముఖంగా ఉంటాయి. ఈ రెండు జట్లు గతంలో అనేకసార్లు లేకిగా ప్రవర్తించాయి. కొన్ని సందర్భాల్లో ఐసీసీ హెచ్చరికలతో సరిపెట్టింది. మరికొన్ని సార్లు జరిమానా విధించింది.
Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!
ఎన్నిసార్లు ఛీత్కరింపులకు గురైనా పాకిస్థాన్ , బంగ్లాదేశ్ బుద్ధి మారడం లేదు. పైగా, ఆ రెండు జట్లు ఇటీవల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం ముందు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాయి. నానాయాగీ చేశాయి. సయామీ కవలల మాదిరిగా బిల్డప్ ఇచ్చాయి. చివరి అస్త్రంగా ఐసీసీ రంగంలోకి దిగడంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ దారిలోకి వచ్చాయి.
బంగ్లాదేశ్ ముందుగా ఆవేశపడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్ పన్నిన ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడింది. ఇంత యాగీచేసినప్పటికీ పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ లో సత్తా చూపించలేకపోయింది. అంతేకాదు, సూపర్ 8 దశ నుంచి బయటకి వచ్చేసింది. పాకిస్థాన్ వ్యవహరించిన తీరు పట్ల మొదట్లో ఐసీసీ గుంభనంగా వ్యవహరించింది. టీ 20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ అధ్యక్షుడు జై షా తొలిసారి పెదవి విప్పారు. తన ఆగ్రహాన్ని నర్మగర్భంగా బయటపెట్టారు.
‘క్రికెట్ ఉన్నతికి ఐసీసీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. జట్ల ఉన్నతి మాత్రమే, క్రికెట్ ఉన్నతి కూడా మాకు అవసరమే. ఐసీసీ అనేది క్రికెట్ ను నిర్దేశిస్తూ ఉంటుంది. ఐసీసీ కంటే ఏ జట్టూ గొప్పది కాదు. ఐసీసీ కేవలం కొన్ని జట్లకు కొమ్ము కాయదు. అన్ని జట్ల సమూహంతోనే ఐసీసీ ఏర్పడింది. క్రికెట్ ఉన్నతికి ఐసీసీ తోడ్పడుతూనే ఉంటుంది. ఈసారి వీక్షణల పరంగా టీ20 వరల్డ్ కప్ సరికొత్తచరిత్ర నెలకొల్పింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యంకాదు. అందరి శ్రమ వల్ల ఇంతటి ఘనత నిర్మితమైందని’ ఐసీసీ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.
షా వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు టీ20 వరల్డ్ కప్ ముందు వ్యవహరించిన తీరుతో మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. అందువల్లే ఆ రెండు జట్ల యాజమాన్యాలు వ్యవహరించిన తీరును ఇలా పరోక్షంగా ఎండగడుతున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.