India vs England, 2nd Test: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తుంది. ముఖ్యంగా రెండో రోజు జైశ్వాల్ డబుల్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఇది ఇలా ఉంటే తను నిప్పులు చెరిగే స్పెల్ వేస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లకి చెమటలు పట్టించాడు. బుమ్రా దెబ్బ కి ఇంగ్లాండ్ ప్లేయర్లు బెంబెలెత్తిపోయారు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కి వెళ్ళడానికి పోటీపడ్డారనే చెప్పాలి. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీమ్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, జైశ్వాల్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఇక ఇంగ్లాండ్ టీమ్ లో క్రువాలీ 76 పరుగులు చేయగా, స్టోక్స్ 47 పరుగులు చేశారు. ఇక వీళ్లిద్దరిని మినహాయిస్తే ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా పెర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. డకెట్ 21, పోప్ 23,రూట్ 5, బెయిర్ స్టో 25, హార్ట్ లీ 21, అండర్సన్ 6, బషీర్ 8 పరుగులు చేశారు. ఇక బేయిర్ స్ట్రో, హార్ట్ లీ ఇద్దరు కొద్ధివరకు బాగానే ఆడినప్పటికి వాళ్ళు కూడా మన బౌలర్ల దాటికి ఎక్కువ సేపు నిలవలేక పోయారు. ఇక ఇండియన్ టీమ్ బౌలర్ అయిన బుమ్రా తనదైన రీతిలో బౌలింగ్ చేయడంతో రెండోరోజు ఇంగ్లాండ్ మీద ఇండియన్ టీమ్ పైచేయి సాధించడమే కాకుండా మ్యాచ్ మొత్తం మనవైపు తిప్పేసాడు.
ఇక కేవలం 34 మ్యాచ్ ల్లో 150 వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా కూడా బుమ్రా ఒక అరుదైన రికార్డుని తన పేరట నమోదు చేసుకున్నాడు. అలాగే ఆసియా ఖండంలోనే ఈ రికార్డును సాధించిన రెండవ భారత బౌలర్ గా కూడా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు…ఇక మొదటి ప్లేస్ లో వకర్ యూనిస్ ఉన్నాడు. 27 మ్యాచుల్లోనే 150 వికెట్లు తీసి మొదటి ప్లేస్ లో నిలిచాడు…ఇక ఈ మ్యాచ్ లో బుమ్రా 6 వికెట్లు తీయగా, కుల్దిప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు…
ఇక ఇది ఇలా ఉంటే అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం… బుమ్రా 6781 , ఉమేష్ యాదవ్ 7661, మహమ్మద్ షమీ 7755, కపిల్ దేవ్ 8378 , అశ్విన్ 8830 లు ఈ ఘనతను తక్కువ బంతుల్లో సాదించిన ప్లేయర్లు…