IPL 2025: ఐపీఎల్ ట్రోఫీ ప్రైజ్ మనీ 20 కోట్లు.. ఈ 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం పది జట్లు పోటీ పడుతుంటాయి. టికెట్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్, ఇతర కమర్షియల్ యాడ్స్ ద్వారా జట్లకు ఆదాయం వస్తుంటుంది.. విజేతగా నిలిచిన జట్టు విలువ అంతకంతకు పెరుగుతుంది.. ఇక యాడ్స్ వల్ల కూడా రెవెన్యూ అధికంగా వస్తుంది. అందువల్లే ఐపీఎల్ ట్రోఫీ కోసం అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయి. 2008లో మొదలైన ఐపిఎల్.. ప్రతి ఏడాది సరికొత్తగా సాగుతోంది. మనదేశంలోనే కాదు దక్షిణాఫ్రికా, దుబాయ్ ప్రాంతాలలో కూడా ఐపీఎల్ ను నిర్వహించారు. అంతటి కరోనా సమయంలోనూ విడతలవారీగా ఐపీఎల్ నిర్వహించారంటే.. దానికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.. ఆర్థిక అవకతవకలు.. ఫిక్సింగ్ ఆరోపణలు పక్కన పెడితే మండు వేసవిలో అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందాన్ని అందించడంలో ఐపీఎల్ ఎప్పుడూ ముందుంటుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. చివరికి జాతీయ జట్టులో ఆడడాన్ని కూడా పక్కనపెట్టి ఐపీఎల్లో తమ సత్తా చాటుతున్నారు.
Also Read: ఇంగ్లాండ్ టూర్ కు ముందు గంభీర్ కీలక నిర్ణయం.. తెలుగోడికి ఉద్వాసన
లక్ష కోట్లకు
2008లో ఐపీఎల్ మొదలైంది. 2009లో ఐపీఎల్ విలువ 17వేల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత అంతకంతకు విస్తరించింది. అప్పట్లో ఐపిఎల్ విలువ 50 వేల కోట్లకు చేరుకుంటే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ లక్ష కోట్లకు చేరడం క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది చూసే ఆటగా ఫుట్ బాల్ పేరు తెచ్చుకుంది . అయితే మరికొద్ది రోజుల్లోనే దానిని ఐపీఎల్ అధిగమించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్ ద్వారా ప్రభుత్వాలకు కూడా దండిగా ఆదాయం వస్తూ ఉంటుంది. విమానయాన సంస్థలకు, హోటల్స్ కు రెవెన్యూ వస్తుంది.
THE BRAND VALUE OF IPL HAS REACHED OVER 1,00,000 CRORE INR. [TAM Sports] pic.twitter.com/0sTpRQaIwh
— Johns. (@CricCrazyJohns) April 17, 2025
ఇక కంపెనీల బ్రాండ్ ప్రమోషన్ కూడా జరుగుతుంది.. క్రికెటర్లు మాత్రమే కాకుండా, చీర్ లీడర్స్, కోచింగ్ స్టాఫ్, నాన్ కోచింగ్ స్టాఫ్ కు ఉపాధి లభిస్తుంది. మరోవైపు కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్ లో జట్ల యజమానులుగా ఉన్నాయి. ఇక ఐపీఎల్ నిర్వాహక కమిటీ కూడా ప్రతి మ్యాచ్ ను న భుతో న భవిష్యతి అనే స్థాయిలో నిర్వహిస్తుంది. అందువల్లే ఐపిఎల్ తన బ్రాండ్ విలువను అంతకంతకు పెంచుకుంది. అయితే వచ్చే రోజుల్లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 2 లక్షల కోట్లకు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ” క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. అంతకుమించిన వ్యాపారం కూడా. కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్ ద్వారా రకరకాల మార్గాలలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. ఫలితంగా పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలను కళ్ళజూస్తున్నాయి. ప్రసార హక్కులు, ఇతర మార్గాల ద్వారా భారీగా ఆదాయం వస్తూ ఉండడంతో ఐపీఎల్ నిర్వాహక కమిటీ కూడా పండగ చేసుకుంటోంది. అందువల్లే ఐపిఎల్ బ్రాండ్ విలువ లక్ష కోట్లకు చేరుకుందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: రోహిత్ ని చూసి స్ఫూర్తి పొందాను.. నేర్చుకున్నాను: ట్రావిస్ హెడ్