Ishan Kishan: ఐపీఎల్ వేలం అప్రతిహాసంగా కొనసాగుతోంది. ఈ వేలంలో ఎవరిని ఎతకు కొంటారనే ఆసక్తితో క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదరుచూస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌కు ఎంత చెల్లించి ఏ ప్రాంచైజీ కొంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్క క్రికెట్ లవర్‌కు ఎంతగానో ఆసక్తి ఉండటం చాలా కామన్. అయితే గత ఐపీఎల్ సీజన్లో దుమ్ము లేపిన ఇషాన్ కిషన్‌కు ఈసారి జాక్ పాట్ దొరికింది.

అందరూ ఊహించనట్టు గానే అతని కోసం ప్రాంచైజీలు పోటీ పోటీగా వేలం పాడాయి. ఇందులో ముందుగా అతను గతంలో ఆడిన ముంబై ప్రాంచైజీ అతని కోసం బిడ్ వేసింది. అతన్ని దక్కించుకునేందుకు అటు పంజాబ్ కింగ్స్ కూడా రంగంలోకి దిగింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో చాలా త్వరగానే 10కోట్ల మార్కు దాటాడు.
Also Read: స్టార్ క్రికెటర్లకు ఐపీఎల్ వేలంలో షాక్.. కొనేందుకు ముందుకు రాని ప్రాంచైజీలు..!
గత రెండు సీజన్లలలో అద్భుతంగా ఆడటంతో అతనికి ముంబై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వేలం రూ.12కోట్లకు రాగానే హైదరాబాద్ కూడా రంగంలోకి దిగింది. దీంతో మరింత ధర పెరిగింది. చివరకు ముంబై ప్రాంచైజీ అతన్ని దాదాపు రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా ఇషాన్ నిలిచాడు.

అతనికి ఐపీఎల్లో ఆడిన ట్రాక్ రికార్డు ఉంది గానీ.. వన్డేల్లో ఆడిన రికార్డు మాత్రం పెద్దగా లేదు. కానీ ఐపీఎల్‌కు కావాల్సింది పొట్టి ఫార్మాట్ హీరోలే కాబట్టి ఇషాన్‌కు ఈ రేంజ్లో ముంబై ఇండియన్స్ వేలం వేసి కొనుగోలు చేసిందంటున్నారు క్రికెట్ నిపుణలు. కాగా స్టార్ క్రికెటర్లను తలదన్ని మరీ అతను ఇంతకు అమ్ముడు పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read: ఆ హీరోయిన్ పాకిస్థానీ బిచ్చగత్తె అట !