Homeక్రీడలుక్రికెట్‌SRH vs RCB: కాటేరమ్మ కొడుకులు చేతులేత్తేశారు.. బుల్లివారసుడు కావ్య జట్టును నిలబెట్టాడు

SRH vs RCB: కాటేరమ్మ కొడుకులు చేతులేత్తేశారు.. బుల్లివారసుడు కావ్య జట్టును నిలబెట్టాడు

SRH vs RCB: బాగా ఆడతాడనుకున్న హెడ్(11) విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ (7) చేతులెత్తేశాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి(1) ఆవేశానికి గురై తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది. Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో.. ఐపీఎల్ లో కాటేరమ్మ కొడుకులుగా పేరుపొందిన హెడ్, అభిషేక్ శర్మ విఫలం కావడంతో హైదరాబాద్ భారీ స్కోర […]

SRH vs RCB: బాగా ఆడతాడనుకున్న హెడ్(11) విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ (7) చేతులెత్తేశాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి(1) ఆవేశానికి గురై తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది.

Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..

ఐపీఎల్ లో కాటేరమ్మ కొడుకులుగా పేరుపొందిన హెడ్, అభిషేక్ శర్మ విఫలం కావడంతో హైదరాబాద్ భారీ స్కోర చేస్తుందనే నమ్మకం ఎవరికీ లేకుండా పోయింది. బెంగళూరు బౌలర్లు ఎక్స్ ట్రా బౌన్సర్లను సంధిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ బ్యాటర్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు.

ఈదశలో వచ్చాడు ఇషాన్ కిషన్.. మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. చెత్త బంతులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. మూడు వికెట్లు కోల్పోయిన క్రమంలో క్లాసెన్(31)తో కలిసి నాలుగో వికెట్ కు 52 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈకథనం రాసే సమయం వరకు ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 8 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో విరవిహారం చేశాడు ఇషాన్ కిషన్.

29 పరుగులకే మూడువికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును నిలబెట్టాడు ఇషాన్ కిషన్. ఢఫీ, భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోతున్న చిన్నస్వామి స్టేడియంలో అదరగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ కొనసాగించిన ఇషాన్ కిషన్ సారథిగా కూడా హైదరాబాద్ జట్టులో అదే స్థాయి చూపిస్తున్నాడు. ఎక్కడా కూడా టెంప్ట్ కాకుండా.. పక్కా ప్రొపెషనలిజాన్ని ప్రదర్శించాడు కిషన్. కాటేరమ్మ కొడుకులు విఫలమైన చోట.. బుల్లి కాటేరమ్మ కొడుకుగా చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు ఇషాన్ కిషన్.

భారీ ఆశలుు పెట్టుకున్న హెడ్ విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ ఆవేశపడ్డాడు. ఇషాన్ కిషన్ మాత్రం సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. చెత్తబంతులను చీల్చిచెండాడిన ఇషాన్ కిషన్.. ఇబ్బంది పెట్టేబంతులను మాత్రం వదిలేశాడు. అతడి ఆట తీరు వల్ల హైదరాబాద్ జట్టు కష్టాల నుంచి బయటపడగలిగింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ పిచ్ మీద బంతులు ఎక్కువ ఎత్తులో రావడంతో హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇసాన్ కిషన్ మాత్రం అలాంటి ఇబ్బందిలేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper