Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు షైన్ కాలేకపోతోంది. కొన్ని సీజన్లుగా విజయాలతో నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్లడం లేదు. ఇతర జట్ల విజయాలు, అపజయాలపై ఆధారపడి ప్లేఆఫ్ అదృష్టాన్ని దక్కించుకుంటోంది. ఈ సీజన్‌లో కూడా ప్లేఆఫ్ ఆశలు దాదాపు లేవు. కానీ, ఇతర జట్లు విజయాలు, ఓటములపై కొద్దిపాటి ఆశ ఉంది.
రసవత్తరంగా లీగ్ మ్యాచ్‌లు..
ఐపీఎల్–2023 సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. 90 శాతం మ్యాచ్‌లు ఉత్కంఠగానే జరిగాయి. క్రికెట్ లవర్స్ ఈ సీజన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దాదాపు అన్ని జట్లు 11 మ్యాచ్‌లు ఆడాయి. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే లీగ్ దశ ముగుస్తుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. చెనై్న, లక్నో, ముంబై రాజస్థాన్ జట్లకు కేడా ప్లేఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వీటికి కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్ జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. అయితే ఈ జీపన్‌లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి వింతగా ఉంది. ఇప్పటికీ ప్లే ఆఫ్ కు చేరే ఛాన్స్ ఉన్నా.. ఇకపై తలపడబోయే జట్లు చూస్తుంటే భయం వేస్తోంది.
నాలుగే విజయాలు..
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడింది. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే హైదరాబాద్ తలపడబోయే జట్లన్నీ బలమైనవే కావడంతో వీటిని ఓడించడం అనుకున్నంత తేలికేం కాదు.
ఆ నాలుగు బలమైనవే..
లీగ్ దశలో సన్ రైజర్స్ జట్టు ఆడే మిగతా నాలుగు మ్యాచ్‌లు అంత్యంత కీలకమైనవే. నాలుగు మ్యాచ్‌ల ప్రత్యర్థి జట్లు బలమైనవే. లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ తలపడాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఈ నాలుగు టీమ్‌లు హైదరాబాద్ కంటే మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాయి. బెంగళూరు ఒక్కటే కాస్త అటు ఇటుగా ఉంది.
వెంటాడుతున్న బ్యాటింగ్ సమస్య..
మరోవైపు హైదరాబాద్‌ను ఈ సీజన్‌లో బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. వరుసగా విఫలమవుతున్న హ్యారి బ్రూక్, మయాంక్ అగర్వాల్‌ను గత మ్యాచ్‌లో తీసేశారు. అయితే అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయిందంటున్నారు ఫ్యాన్స్. జట్టులో మార్పులు చాలా లేట్ గా చేశామని.. 9 మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నా వాళ్లకి ఛాన్సులు ఇచ్చి తప్పుచేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్ కూడా విఫలం..
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ కూడా ఈ సీజన్‌లో విఫలమువున్నాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మార్‌క్రమ్ పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. బౌలర్లు కాస్త బాగానే రాణిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. మిగతా నాలగు మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే!