Ravichandran Ashwin: ఇండియన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఏ ప్లేయర్ అయితే టీం కి అవసరం అని అనుకుంటున్నారో వాళ్లని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది.అలాంటి ప్లేయరని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసిన కూడావాళ్ళు టీం కి ఏ రకం గా కూడా హెల్ప్ అవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు సెలెక్టెడ్ గా టీం కి ఎవరైతే బాగా ఆడుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆడలేకపోతే అప్పుడు ఆయన ప్లేస్ లోకి ఇంకో ప్లేయర్ ని రీప్లేస్ చేస్తుంది ఇక ఇప్పుడు అదే జరిగింది.ఏషియా కప్ లో జరిగిన ఇండియా బాంగ్లాదేశ్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయపడగానే ఆయన ప్లేస్ లోకి అర్జెంట్ గా వాషింగ్ టన్ సుందర్ ని తీసుకోవడం జరిగింది ఆయన వచ్చి ఫైనల్ మ్యాచ్ ఆడాడు.
అయితే వరల్డ్ కప్ లో ఆడే ఇండియా టీం ని ఇప్పటికే బిసిసిఐ ప్రకటించింది అయినప్పటికీ ఈ టీం లో ఉండే ప్లేయర్ అయిన అక్షర్ పటేల్ కి గాయం అవ్వడం తో ఇపుడు ఆస్ట్రేలియా మీద జరిగే మొదటి రెండు మ్యాచ్ ల్లో అక్షర్ పటేల్ ప్లేస్ లో అశ్విన్ ని తీసుకోవడం జరిగింది.ఈ మ్యాచ్ లో తాను కనక బాగా ఆడితే వరల్డ్ కప్ టైం కి అక్షర్ పటేల్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే అప్పుడు వరల్డ్ కప్ టీం లోకి అశ్విన్ వస్తాడు…
అందుకోసం అనే ఇపుడు అశ్విన్ ని ఆస్ట్రేలియా టీం మీద తీసుకోవడం జరిగింది.అశ్విన్ లాంటి ఒక సీనియర్ బౌలర్ టీం లో ఉండటం టీం కి చాలా ప్లస్ అవుతుంది. అందుకోసం అనే ఎలాగైనా అశ్విన్ ని టీం లోకి తీసుకురావాలని చుస్తునారు.ఇక అక్షర్ పటేల్ కి మరో రీప్లేస్ మెంట్ గా టీం లోకి వచ్చిన ప్లేయర్ వాషింగ్ టన్ సుందర్. ఈయన ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఈయన కూడా ఎప్పుడు గాయాల బారిన పడి మ్యాచ్ నుంచి వెళ్లిపోయేది తెలీదు కాబట్టి అందుకే టీం లో అశ్విన్ ఉంటె బాగుంటుంది అని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా ప్లాన్ వేసినట్టు గా తెలుస్తుంది…అశ్విన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు అలాగే బాగా అనుభవం ఉన్న ప్లేయర్ అవ్వడం కూడా దానికి ఒక కారణం గా మనం చెప్పవచ్చు…చూడాలి మరి వరల్డ్ కప్ మ్యాచుల్లో ఎవరు అందుబాటు లో ఉంటారు అనేది…