Homeక్రీడలుMS Dhoni IPL 2023: ‘రిజర్వ్‌ డే’ ధోనీ రిటైర్మెంట్‌కు సంకేతమా.. చరిత్ర అదే చెబుతుందా?

MS Dhoni IPL 2023: ‘రిజర్వ్‌ డే’ ధోనీ రిటైర్మెంట్‌కు సంకేతమా.. చరిత్ర అదే చెబుతుందా?

MS Dhoni IPL 2023: ఐపీఎల్‌–2023 ఫైనల్‌ మ్యాచ్‌కు (మే 29, రిజర్వ్‌ డే) ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌తోపాటు యావత్‌ భారత క్రికెట్‌ అభిమానులకు ఓ భయం పట్టుకుంది. ఈ సీజన్‌తోనే ధోని తన ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతాడేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్‌–2023 ఫైనల్‌ మ్యాచే ధోనీకి ఆఖరిదవుతుందేమోనని కలత చెందుతున్నారు. «ఫ్యాన్స్‌ భయానికి ఓ బలమైన కారణం ఉంది.

ఆ రోజే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌..
ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను రిజర్వ్‌ డే రోజునే ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో షెడ్యూల్‌ ప్రకారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డేకు(జులై 10) వాయిదా పడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఏడాది అనంతరం 2020, ఆగస్టు 15వ తేదీన ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించాడు.

తాజా సంకేతం అదేనా..
తాజాగా ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. దీంతో అభిమానులు భయపడుతున్నారు. ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు ఎలాగైతే వీడ్కోలు పలికాడో, ఐపీఎల్‌కు కూడా అలాగే రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడేమోనని దిగులుపడుతున్నారు. ధోనీ లేని ఐపీఎల్‌ను ఊహించుకోలేమని పేర్కొంటున్నారు. ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తే మాత్రం.. వరణుడే సంకేత్రం ఇస్తున్నట్లు గుర్తించాలి.

గణాంకాల ప్రకారం కూడా…
ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన చివరి మ్యాచ్‌ను, ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ను కంపేర్‌ చేసుకుంటూ తెగ ఫీలైపోతున్నారు. గణాంకాల ప్రకారం కూడా ధోనీ రిటైర్మెంట్‌కు కారణం చెబుతున్నారు. ధోనికి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్‌(వన్డే) 350 వదని, ఐపీఎల్‌–2023 ఫైనల్‌ మ్యాచ్‌ అతనికి 250వదని పేర్కొంటున్నారు. ఈ లెక్కలతో కూడా ధోని రిటైర్మెంట్‌ను నిర్ధారిస్తున్నారు. పాత రికార్డు, గణాంకాలు, లెక్కలతో ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను వైరల్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular