India Vs Australia World Cup Final: మరికాసేపట్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపైన తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి.ఇక ఇదే సమయం లో ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ మాత్రం ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎవరిని నిర్ణయిస్తారు అనే విషయం మీద పలు రకాల ఆసక్తికరమైన కామెంట్లని చేశాడు…ఈ వరల్డ్ కప్ లో చాలామంది ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శనని కనబరిచారు. మరి ముఖ్యంగా ఇండియన్ టీం నుంచి రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్లు వాళ్ళ వంతు ప్రయత్నం గా ప్రతి మ్యాచ్ లో సెంచరీలు,హాఫ్ సెంచరీ లు చేస్తూనే ఇండియన్ టీం కి మంచి విజయాలను అయితే అందించారు.
కానీ ఇండియన్ టీం లో మొదటి మూడు మ్యాచ్ లు ఆడిన తర్వాత హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీ నుంచి వెనుతిరగడం తో ఇండియన్ టీం లోకి పేస్ బౌలర్ వచ్చి అద్భుతాలు చేసిన బౌలరే మహమ్మద్ షమీ… ఆయన వచ్చినప్పటి నుంచి ఇండియన్ టీం ఎక్కడ కూడా బౌలింగ్ లో వెనకడుగు వేయలేదు ప్రతి మ్యాచ్ లో ఆధిపత్యాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తూ వచ్చింది. ఇక ఈ యువ పేసర్ కి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు తీసుకునే అర్హత పుష్కలంగా ఉంది అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అలాగే రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ప్లేయర్లు వాళ్లు చాలా బాగా ఆడారు అయినప్పటికీ బెంచ్ కి పరిమితమైన షమీ ఏ మాత్రం ఢీలా పడకుండా టీమిండియాలోకి వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టించడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్తూనే,మొదట ప్లేయింగ్ లెవెన్ లో చోటు కల్పించుకోలేని షమీ ఆ తర్వాత ఇండియన్ టీం ని ఫైనల్ లో నిలపడానికి ఒక కారణమయ్యాడు.
ఇక అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఆయనకే ఇవ్వాలి అంటూ యువరాజ్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు…అయితే టీమిండియా ఫైనల్ కి చేరుకోవడం కూడా ఒక అద్భుతం అని చెబుతూ ఏషియా కప్ కి ముందు టీమిండియాలో చాలా రకాల ఇబ్బందులు ఉండేవి కానీ ఆసియా కప్ నుంచి ఇండియా తనని తాను పూర్తిగా మార్చుకొని, ప్లేయర్లు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తు వస్తున్నారు.ఇక ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ ,కె.ఎల్ రాహుల్ , బుమ్ర లాంటి ప్లేయర్లు గాయాల భారీ నుంచి కోలుకున్న తర్వాత అత్యున్నతమైన ప్రదర్శనను ఇవ్వడం వాళ్ల కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుంది, అలాగే ఇండియన్ టీం కి కూడా చాలా హెల్ప్ అయింది అని చెప్పాడు.
ఇక ఇండియా ఫైనల్ కి చేరడం లాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని సాధించడం నిజంగా ఇండియన్స్ అందరికీ గర్వకారణం…రోహిత్ శర్మ గానీ అలాగే కోచ్ ద్రావిడ్ గానీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈసారి కప్పు తీసుకురావాలని యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు…