Shikhar Dhawan Odi World Cup: ఏషియా కప్ లో భాగంగా ఇండియా మ్యాచులు ఆడుతున్న విషయం మనకు తెలిసిందే కానీ ఏషియా కప్ కొట్టాలి అంటే ఇండియా ఇంకా బాగా ఆడాలి అనే విషయం అయితే మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఎందుకంటే మొన్న పాకిస్థాన్ మీద ఆడిన మ్యాచ్ లో ఓపెనర్లు ఫెయిల్ అయ్యారు కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్ లు కూడా ఫెయిల్ అయ్యారు ఇక నెంబర్ ఫైవ్ లో వచ్చిన ఇషాన్ కిషన్ ఇక నెంబర్ సిక్స్ లో వచ్చిన హార్దిక పాండ్య లు మాత్రమే సూపర్ గా ఆడి మన ఇండియా టీమ్ పరువు కాపాడారు…అయితే మన టీమ్ ఎందుకు ఎక్కువ స్కోర్ చేయడం లో తడపడుతుంది అనే విషయాన్ని గమనిస్తే మెయిన్ గా ఇండియా టీమ్ లో నెంబర్ 6 లో ఇషాన్ కిషన్ ఒక్కడు మాత్రమే లెఫ్ట్ హ్యండర్ ప్లేయర్ ఉన్నాడు అది కూడా రాహుల్ కి ఇంజురీ అవ్వడం వల్ల ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ టీమ్ లోకి వచ్చాడు అయితే ఇక ఈయన కూడా లేకుండా రాహుల్ ఉంటే టాప్ 6 లో అసలు ఒక్కరూ కూడా లెఫ్ట్ హండర్స్ ఉండేవారు కాదు… నిజానికి అయితే నెంబర్ 6 లో కనీసం ముగ్గురు అయిన లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లు ఉండాలి లేకపోతే ఇద్దరైన ఉండాలి…అసలు లెఫ్ట్ హ్యండర్లు టీమ్ లో ఉండటం వల్ల యూజ్ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ చాలా వరకు ఇబ్బంది పడుతారు. అదే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ అయితే వాళ్ల బౌలింగ్ లో సునాయాసం గా రన్స్ చేయగలుగుతారు.అందుకే టీమ్ లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యండర్లు ఉండేలా చూసుకుంటారు…ఇక ఈ విషయం మొన్న మనవాళ్ళు పాకిస్థాన్ మీద జరిగిన మ్యాచ్ లో కూడా మనకు కనిపించింది… పాకిస్థాన్ పేస్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిది వేసిన బాల్స్ ని ఎదురుకోవడం లో మన ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ కానీ, శుభమన్ గిల్ కానీ చాలా ఇబ్బంది పడ్డారు చివరికి అయితే కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా షాహిన్ అఫ్రిది బౌలింగ్ లోనే బోల్డ్ అయ్యారు…
ఇక అందుకే ఒక లెఫ్ట్ హ్యాండర్ కనక ఓపెనింగ్ లో ఉంటే టీమ్ ఇంకా భారీ స్కోరు చేయగలదు…అయితే టీమ్ లో ఉన్న ప్లేయర్ లలో లెఫ్ట్ హ్యాండ్ తో అడగలిగే ప్లేయర్ గా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ ఆయన్ని ఓపెనర్ గా కాకుండా నెంబర్ ఫైవ్ లోనే ఆడించడం బెస్ట్ ఇక వరల్డ్ కప్ వరకు ఓపెనింగ్ కి మాత్రం శిఖర్ ధావన్ ను తీసుకుంటే బెస్ట్ అని అనుకున్నారు…ఇక ఇది ఇలా ఉంటె రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో బుమ్రా కూడా ఆడలేదు అయన ప్లేస్ లో మహమ్మద్ షమీ టీం లోకి వచ్చాడు… అయితే బుమ్రా తన భార్య ప్రస్తుతం డెలివరీ కావడానికి రెఢీ గా ఉండటం తో ఆయన ముంబై కి వచ్చారు నెక్స్ట్ ఒక రెండు మ్యాచ్ లకి ఆయన అవలెబుల్ లో ఉండడు అనే విషయం అయితే మనకు తెలిసింది…అయితే బుమ్ర అలా రావడాన్ని కొంత మంది వ్యతిరేకించినప్పటికీ చాలా మంది బుమ్రా కి అండగా నిలిచి మాట్లాడుతున్నారు ఇలా వాళ్ల భార్యలు డెలివరీ టైం లో ఉన్నప్పుడు చాలా మంది ప్లేయర్లు వెళ్లిపోయారు అంతెందుకు కోహ్లీ కూడా అనుష్క శర్మ డెలివరీ టైం లో మ్యాచ్ వదిలేసి వెళ్లిపోయాడు. నిజానికి డెలివరీ అనేది ఆడవాళ్ళకి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ టైం లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ల కండ్ల ముందు ఉండాలి అని కోరుకుంటారు…కాబట్టే బుమ్రా వెళ్ళాడు…
అయితే ఈజిగా మనవాళ్ళు నేపాల్ మీద మ్యాచ్ గెలిచిన కూడా నెక్స్ట్ మళ్ళీ పాకిస్థాన్ తో ఒక మ్యాచ్ అయితే ఉంటుంది. ఇక ఆ మ్యాచ్ వరకు బుమ్రా టీమ్ లో ఉంటాడనే చెప్పాలి…ఇక మన వాళ్ళు ఈ మ్యాచ్ లో గెలవాలంటే మాత్రం రైట్, లెఫ్ట్ కాంబో ని ఎక్కువగా వాడుకోవాలి. నిజానికి పాకిస్థాన్ జట్టు లో మొదటి నలుగురు ప్లేయర్లు కూడా ఇద్దరు రైట్ హ్యాండ్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లు ఉన్నారు అందుకే వాళ్ల టీమ్ ఎక్కువ రన్స్ చేయగల్గుతుంది… వాళ్ళనే కాదు ఆస్ట్రేలియా టీమ్ లో కూడా టాప్ ఫోర్ లో పక్క గా వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ హండర్లు ఉండేలా చూసుకుంటారు…అయితే మనకు లెఫ్ట్ హ్యాండ్ ఒపెనర్లలో శిఖర్ ధావన్, యశస్వి జైశ్వాల్ ఇద్దరు ఉన్నారు.వీళ్ళు ఇద్దరు కూడా మంచి ప్లేయర్లే అయినప్పటికీ వరల్డ్ కప్ కోసం శిఖర్ ధావన్ ని తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే జైశ్వాల్ కి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ధావన్ అయితే బెస్ట్ అని అందరు అనుకున్నారు కానీ అందరికి షాక్ ఇస్తూ బిసిసిఐ శిఖర్ ధావన్ ని వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి సెలెక్ట్ చేయలేదు…ఎందుకు ఆయన్ని సెలెక్ట్ చేయలేదు అనే విషయం ఎవ్వరికి తెలియదు…ఆయన్ని సెలెక్ట్ చేయకపోవడం వల్ల ఆయనకి పోయేది ఏమి లేదు కానీ టీం మాత్రం చాలా నష్టపోతోంది అనే చెప్పాలి…లాస్ట్ టైం వరల్డ్ కప్ లో రాయుడు కి ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో ?, ఇప్పుడు కూడా శిఖర్ ధావన్ కి అలాంటి అన్యాయమే జరిగింది నిజానికి అది రాయుడు కి జరిగిన అన్యాయం అని అనడం కంటే కూడా మం ఇండియా టీం కి జరిగిన అవమానం అనే చెప్పాలి. ఎందుకంటే ఇండియా సెమీఫైనల్ లో న్యూజిలాండ్ మీద ఓడిపోయి మన ఇండియా టీం పరువు తీసారని చెప్పాలి.ఎందుకంటే ఆ మ్యాచ్ లో రాయుడు ఉండి ఉంటె జడేజా కి మంచి సపోర్ట్ ఇస్తూ ఇద్దరు చివరి వరకు ఆడి మ్యాచ్ ని గెలిపించేవారు.జడేజా కి ధోని చాలా వరకు సపోర్ట్ ఇచ్చిన కూడా ధోని రన్ అవుట్ అవ్వడం తో జడేజా ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు అయిన కూడా ఆ మ్యాచ్ ఓడిపోయింది. దాని వల్ల రాయుడు ఎంత నష్టపోయాడో తెలీదు కానీ 140 కోట్ల మంది భారతీయులు పెట్టుకున్నఆశలను చంపేశారు…అప్పుడు ఇండియా ఓడిపోవడం లో బిసిసిఐ పాత్ర చాలా వరకు ఉంది వాళ్ళు కనక రాయుడి ని సెలెక్ట్ చేసి ఉంటె మనం సెమిస్ లో గెలిచేవాళ్ళం ఆ తరువాత ఫైనల్ లో కూడా గెలిచేవాళ్ళం ఇక అప్పడు చేసిన తప్పే బిసిసిఐ సెలెక్టర్లు ధావన్ ని తప్పించి మళ్లీ ఇప్పుడు కూడా చేస్తున్నారు ధావన్ లేకుండా ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా..?, లేదా..? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి…
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Is it a big mistake not to select shikhar dhawan in the world cup
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com