Homeక్రీడలుIndia Vs Pakistan: సూపర్ 4 లో పాకిస్థాన్ పై భారత్ గెలవగలదా..?లోటుపాట్లు ఏంటి..?

India Vs Pakistan: సూపర్ 4 లో పాకిస్థాన్ పై భారత్ గెలవగలదా..?లోటుపాట్లు ఏంటి..?

India Vs Pakistan: ఏషియా కప్ లో భాగంగా ఈనెల 10 వ తేదీన మన ఇండియా టీం పాకిస్థాన్ తో ఒక మ్యాచ్ ఆడనుంది. ఇంతకు ముందు ఈ రెండు టీం లు ఆడిన మ్యాచ్ వర్షం కారణం గా రద్దు చేయబడింది ఇక ఇప్పుడు మాత్రం ఈ రెండు టీం ల మధ్య జరిగే మ్యాచ్ కోసం జనాలు అందరు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్ ని ఓడిస్తే చూడాలి అని ఇండియన్ అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.ఇక దీనికి తోడు ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా గెలవాలి, అలా గెలిస్తేనే మన టీం లో కాన్ఫిడెంట్ లెవల్ కూడా చాలా వరకు పెరుగుతుంది అనే చెప్పాలి…ఇక రీసెంట్ గా బిసిసిఐ వరల్డ్ కప్ కి ఆడే ఇండియన్ టీం స్క్వాడ్ ని కూడా ప్రకటించింది.

ఇక ఈ స్క్వాడ్ లో ఇండియా టీంలో ఉన్న ప్లేయర్లలో చాలా మంది ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ధావన్ లాంటి ప్లేయర్లని సెలెక్ట్ చేయలేదని బిసిసిఐ మీద చాలా మంది నెగిటివ్ అభిప్రాయం తో ఉన్నారు…ఇక ఇదే టైం లో ప్రస్తుతం ఇండియా ఆడుతున్న ఏషియా కప్ లో కూడా విజయం సాధిస్తేనే మన టీం వరల్డ్ కప్ లో గెలవగలదు.ఇక అందులో భాగంగానే పాకిస్థాన్ మీద ఇండియా ఆడే మ్యాచ్ కూడా చాలా కీలకంగా మారబోతుందనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఎందుకంటే పాకిస్థాన్ టీం ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఫామ్ లో ఉంది.అయితే ఈ టీం ఆడిన మూడు మ్యాచుల్లో కూడా మూడు టీంలను ఆల్ అవుట్ చేసింది.మొదట నేపాల్ టీం ని 104 పరుగుల వద్ద ఆలౌట్ చేసింది. అలాగే మన ఇండియా టీం ని 266 పరుగుల వద్ద ఆలౌట్ చేసింది. ఇక వాళ్ళు ఆడిన మూడోవ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ని కూడా 193 పరుగులకే ఆలౌట్ చేసింది…ఈ రకం చూసుకుంటే వాళ్ల బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా వాళ్ల పేస్ బౌలర్లు స్పిన్నర్ల తో సంబందం లేకుండా వికెట్లు తీస్తున్నారు…

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ టీం బౌలర్లు అయినా నసీం షా, షాహిన్ ఆఫ్రిది,హారిస్ రాఫ్ లాంటి ముగ్గురు పేస్ బౌలర్లతో పాకిస్థాన్ టీం బౌలింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిజానికి ఈ టీం లో ఉన్న బౌలర్లు అందరు చాలా చక్కటి ప్రదర్శనని కనబరుస్తున్నారు… ఇలాంటి స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న పాకిస్థాన్ టీం ని ఎదుర్కోవడానికి మన టీం కొన్ని వ్యూహాలు అయితే రచించాల్సి ఉంటుంది. ఇక ఎందుకంటే ఇప్పటివరకు ఏషియా కప్ లోజరిగిన మ్యాచుల్లో టాప్ త్రి లో వీళ్లు ముగ్గురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. ఇక వీళ్ళలో హరీస్ రాఫ్ మూడు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు. అలాగే సెకండ్, థర్డ్ పొజిషన్ లో తలో ఏడూ వికెట్లు తీసి నసీం షా, షాహిన్ ఆఫ్రిది లు ఉన్నారు…

అయితే ఈ మ్యాచ్ శ్రీలంక దేశంలోని కొలంబోలో ఉన్న ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగబోతుంది కాబట్టి మనం ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది బ్యాటింగ్ కి ఎక్కువ గా అనుకూలించే గ్రౌండ్ అని తెలుస్తుంది.అలాగే కొద్ది పాటి ఓవర్లు గడిచిన తర్వాత ఇది స్పిన్నర్లకు కూడా బాగా అనుకూలిస్తుంది…ఇక ఈ పిచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీములే ఎక్కువగా విజయం సాధిస్తాయి అని తెలుస్తుంది.ఇక ఇందులో బ్యాట్స్మెన్స్ ఎంత బాగా పరుగులు చేయగలరో స్పిన్నర్లు కూడ అంతే మ్యాజిక్ చేయగలరు అని తెలుస్తుంది. అయితే దీనికి ఒక ఉదాహరణ గా 2009 లో ఈ పిచ్ లో జరిగిన ఒక మ్యాచ్ లో శ్రీలంక కు చెందిన స్పిన్ దిగ్గజం అయిన అజంతా మెండీస్ 20 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు అది కూడా మన ఇండియా మీదనే కావడం విశేషం….దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ స్పిన్ కి ఎంత బాగా అనుకూలిస్తుందో…

ఇక గత మ్యాచులో చూసుకుంటే షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ ని ఎదురుకోవడానికి రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లు కూడా కొంత వరకు ఇబ్బంది పడ్డారు. అలాగే వీళ్లిద్దరు కూడా ఆయన బౌలింగ్ లోనే అవుట్ అవ్వడం కూడా మన చూసాం…మన బ్యాట్స్మెన్స్ లో రోహిత్ శర్మ,శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్,శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య లాంటి ప్లేయర్లలో ఏ ముగ్గురు ప్లేయర్లు అయినా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే మన టీం ఈజీగా పాకిస్థాన్ మీద మ్యాచ్ గెలుస్తుంది..ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కి చెందిన షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ లాంటి స్పిన్ బౌలర్లు కూడా చాలా కీలకంగా మారనున్నారు.ఇక పాకిస్థాన్ బ్యాటింగ్ ని కనక ఒకసారి చూసుకుంటే ఆ టీం బ్యాటింగ్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది ముఖ్యంగా ఓపెనర్లు అయినా ఫకర్ జమాన్,ఇమామ్ ఉల్ హాక్ లు చాలా డేంజరేస్ ప్లేయర్లు అనే చెప్పాలి.ఇక వీళ్ల తర్వాత బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్ లాంటి ప్లేయర్లు కూడా ఉన్నారు.మొదట గా ఇండియన్ బౌలర్లు వీళ్ల నలుగురిని కట్టడి చేయాల్సి ఉంటుంది.వీళ్లు కనక తక్కువ స్కోర్లకే అవుట్ అయితే ఇండియా చాలా వరకు విజయం సాధించినట్లే కానీ వాళ్ళని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. ఇక మన టీం లో స్పిన్ బౌలర్లు అయినా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ స్పిన్ మ్యాజిక్ ని చూపించాల్సి ఉంటుంది.నిజానికి అయితే ఇలాంటి పిచ్ లా మీద రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్ ఉంటె పాకిస్థాన్ ప్లేయర్లని చాలా వరకు చిక్కుల్లో పడేసేవాడే కానీ మన సెలెక్టర్లు ఆయన్నిసెలెక్ట్ చేయలేదు…ఈ మ్యాచ్ లో ఏ టీం టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ తీసుకుంటారు.ఇక ఈ మ్యాచ్ లో కనక మళ్లీ వర్షం కురిస్తే రిజర్వ్ డే కింద మరో రోజు మ్యాచ్ జరగనుందనే విషయం కూడా తెలుస్తుంది.మ్యాచ్ స్టార్ట్ అయ్యాక వర్షం పడితే ఎక్కడైతే మ్యాచ్ ఆడిపోయిందో మళ్లీ అక్కడి నుండే నెక్స్ట్ డే మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది…అలా ఈ మ్యాచ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధం గా చూస్తూనే కచ్చితంగా ఈ మ్యాచ్ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా తెలుస్తుంది…
ఇక ఈ మ్యాచులో గెలవడం ఇండియా టీం కి చాలా కీలకం అనేది మాత్రం టీం మెంబర్స్ గుర్తుపెట్టుకొని ఆడితే మంచిది…

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular