KL Rahul: ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి కొందరు దూకుడుగా ఆడితే మరికొందరు మాత్రం స్లో గా ఆడుతూ టీమ్ కి వాళ్ల వంతు సహకారాన్ని అందిస్తారు. అయితే ప్రస్తుతం టీమ్ ఇండియా లో ఎమ్మెస్ ధోనీ రిటైర్ అయ్యాక ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసే ప్లేయర్ గా పంత్ దొరికినప్పటికి పంత్ అటు కీపర్ గా, ఇటు బ్యాట్స్మెన్ గా కొంత వరకు పర్లేదు అని అనిపించాడు కానీ కొద్దిరోజుల క్రితం పంత్ కి యాక్సిడెంట్ జరగడం తో ప్రస్తుతం ఆయన క్రికెట్ కి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నాడు…అయితే ఇప్పుడు ఇండియన్ టీమ్ లో వికెట్ కీపర్ ఎవరు అనే దాని మీద చాలా ప్రశ్నలు ఎదురువుతున్నాయి…
ఇక ఈ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి చాలా రోజుల నుంచి అటు సంజు సాంసన్, ఇటు ఇషాన్ కిషన్,కె ఎల్ రాహుల్ ముగ్గురు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు…నిజానికి పంత్ కంటే ముందే సంజు సాంసన్ కీపర్ గా ఆడాల్సింది కానీ ఆయనకి మొదట్లో ఇచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేక పోవడంతో దాంతో సాంసన్ ప్లేస్ లోకి కే ఎల్ రాహుల్, రిషబ్ పంత్ వచ్చారు. అందుకే సంజు సాంసన్ తర్వాత ఎంత బాగా ఆడిన కూడా మళ్ళీ ఆయన్ని బిసిసిఐ తీసుకోలేదు…ఇక ఈ మధ్య ఒకసారి మళ్ళీ బిసిసిఐ అతనికి ఛాన్స్ ఇచ్చింది. ఇక దాంతో తన ప్రతిభ ని ప్రూవ్ చేసుకున్నాడు.ఒకసారి బాగా ఆడుతాడు మళ్లీ నెక్స్ట్ ఫెయిల్ అయి పోతాడు కన్సిస్టెన్సీ లేకుండా ఆడటం తోనే సంజు సంసాన్ ని ఏషియా కప్ కి కానీ, ఇప్పుడు జరగబోయే ప్రపంచ కప్ కి కానీ బిసిసిఐ
సెలెక్ట్ చేయలేదు.
అయితే ఇప్పటికే వికెట్ కీపర్లు గా ఉన్న రాహుల్, పంత్, ఇషాన్ కిషన్,సాంసన్ అందరూ కూడా అటు కీపింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ బాగా రాణించినప్పటికి వీళ్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. ఇక పంత్,సాంసన్ లను పక్కన పెడితే రాహుల్,ఇషాన్ కిషన్ మాత్రం కొన్ని మ్యాచ్ ల్లో సరిగ్గా ఆడితే మరి కొన్ని మ్యాచ్ ల్లో ఫెయిల్ అవుతున్నారు…ఇక ఇప్పుడు జరిగిన ఏషియా కప్ లోమాత్రం ఇద్దరు మంచి పెర్ఫామెన్స్ అయితే ఇచ్చారు.ఇక పంత్ గాయం కారణంగా ఆడలేకపోతున్నప్పటికీ సాంసన్ వన్డే ఇంటర్నేషనల్ కెరియర్ ఆల్మోస్ట్ ముగిసినట్టే కాబట్టి రాహుల్,ఇషాన్ కిషన్ ల మీదనే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. వీళ్లిద్దరు కూడా నెంబర్ 4 , 5 లో ఆడుతారు కాబట్టి మ్యాచ్ ని బట్టి సెలక్టర్లు ప్లేయర్లని తీసుకునే పరిస్థితి వచ్చింది. ప్రసూతానికి అయితే ధోని వారసుడిగా కె ఎల్ రాహుల్ కి కొనసాగే అవకాశం అయితే ఉంది.ఎందుకంటే రీసెంట్ గా సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి వరల్డ్ కప్ లో కూడా మంచి పెర్ఫామెన్స్ ఇస్తే ధోని వారసుడిగా కె ఎల్ రాహుల్ నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ చివర్లో ధోని లాగా భారీ సిక్స్ లుకూడా కొట్టగలడు అలాగే కీపింగ్ కూడా చాలా బాగా చేయగలడు…